Free OTT subscriptions : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి 'ఫ్రీ' సబ్స్క్రిప్షన్- సినిమా లవర్స్‌కి పండగే!
Flipkart SuperCoins : ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ ఆదా చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్‌తో ఉచితంగా లేదా డిస్కౌంట్ రేటుతో టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీరు సినిమా ప్రియులా? ఓటీటీలో విపరీతంగా సినిమాలు చూసే అలవాటు ఉందా? ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్రీగా దొరికితే బాగుంటుంది అని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! పూర్తి ధర చెల్లించకుండా జీ 5, సోనీ లివ్‌తో పాటు మరెన్నో ప్రజాదరణ పొందిన ఓటీటీ యాప్స్‌ని యాక్సెస్ చేయడానికి సులభమైన మార్గం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ప్రత్యేకమైన "సూపర్ కాయిన్: రివార్డ్స్ సిస్టమ్‌ని ఉపయోగించి ఉచితంగా లేదా డిస్కౌంట్లో సబ్స్క్రిప్షన్లను పొందొచ్చు. ఈ ఆఫర్‌ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఇలా అన్‌లాక్ చేయండి..
1. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయండి.
ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో, సూపర్ కాయిన్ ఆప్షన్ని ట్యాప్ చేయండి. అక్కడ మీరు సంపాదించిన కాయిన్స్ సంఖ్యను చూడవచ్చు.
2. మీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ఎంచుకోండి..
"ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందండి" అనే బ్యానర్ కోసం చూడండి. దానిపై క్లిక్ చేస్తే సోనీ లివ్, జీ5, టైమ్స్ ప్రైమ్ ప్రీమియం ప్యాక్, గానా, ఓటీటీ ప్లే వంటి అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కనిపిస్తాయి. కొన్ని సబ్ స్క్రిప్షన్లకు సూపర్ కాయిన్లు మాత్రమే అవసరం, మరికొన్నింటికి మీ కాయిన్స్ ఉపయోగించడంతో పాటు సబ్స్క్రిప్షన్ ఫీజులో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
3. మీ కూపన్ కోడ్ పొందండి..
మీకు కావాల్సిన ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎంచుకోండి. 'యూజ్ కాయిన్' ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్లోని 'మై రివార్డ్స్' విభాగంలో కూపన్ కోడ్ జనరేట్ అయి సేవ్ అవుతుంది.
4. కూపన్ ఉపయోగించుకోండి..
మీరు ఎంచుకున్న ఓటీటీ సర్వీస్ వెబ్‌సైట్‌కి కూపన్‌ని రీడీమ్ చేయండి. మీ మొబైల్ నెంబరుతో సైన్ ఇన్ చేయండి, మెగా మెనూకు నావిగేట్ చేయండి. "యాక్టివేట్ ఆఫర్" ఎంచుకోండి. ఇక్కడ, మీ సబ్స్క్రిప్షన్ క్లెయిమ్ చేయడానికి కూపన్ కోడ్‌ను ఇవ్వండి.
5. పేమెంట్ పూర్తి చేయండి..
కొన్ని ప్లాట్‌ఫామ్‌లకు సూపర్ కాయిన్లు ప్రధాన భాగాన్ని కవర్ చేస్తున్నప్పటికీ, మీరు ఇంకా సబ్స్క్రిప్షన్ ఫీజులో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ కూపన్ అప్లై చేసిన తరువాత, తగ్గించిన మొత్తాన్ని చెల్లించండి, మీ సబ్ స్క్రిప్షన్ యాక్టివేట్ అవుతుంది.
వినోదానికి మించి, ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్.. వివిధ ఉత్పత్తులు, సేవలపై కూడా డిస్కౌంట్లు వంటి మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. మీ సూపర్ కాయిన్లను తెలివిగా ఉపయోగించడం ద్వారా, మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. మంచి డీల్స్ కూడా పొందొచ్చు.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం