అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై బిగ్ అప్డేట్! ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి వేసుకున్న టారీఫ్లను తగ్గించుకునేందుకు ఒప్పుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను 90 రోజుల పాటు 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నట్టు బీజింగ్ ప్రకటించింది. జెనీవాలో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా చైనా వస్తువులపై సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని అమెరికా నిర్ణయించింది.
వాణిజ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ సమస్యల పరిష్కారానికి మరో మూడు నెలల సమయం ఇస్తూ, పరస్పరం ఉత్పత్తులపై తాత్కాలికంగా సుంకాలను తగ్గించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం అని నిపుణులు చెబుతున్నారు.
చాలా చైనా దిగుమతులపై మొత్తం 145% యూఎస్ సుంకాలు మే 14 నాటికి, ఫెంటానిల్ (పెయిన్ రిలీఫ్ డ్రగ్)తో ముడిపడి ఉన్న రేటుతో సహా ,30% కు తగ్గుతాయి. అదే సమయంలో యూఎస్ వస్తువులపై 125% చైనా సుంకాలు 10%కు తగ్గుతాయి.
ఫెంటానిల్ పై ముందుకు సాగే చర్యలపై తాము చాలా బలమైన, ఉత్పాదక చర్చ జరిపామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. తాజా డెవలప్మెంట్ నుంచి తప్పించుకోవాలని లేదని తాము ఏకీభవిస్తున్నామని చెప్పారు.
ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చర్చలను కొనసాగించడానికి పార్టీలు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయని అమెరికా ప్రకటన తెలిపింది.
పసిఫిక్ మహాసముద్రం అంతటా వాణిజ్యంలో క్షీణతకు దారితీసిన టారీఫ్ వార్ని తగ్గించే దిశగా ఈ ప్రకటన ఒక ముందడుగు. ఏప్రిల్ 2న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "లిబరేషన్ డే" సుంకాలను ప్రకటించిన తరువాత రెండు దేశాలు తమ చర్చల్లో "గణనీయమైన పురోగతి" ని నివేదించాయి. ఇది మార్కెట్లను ఉత్తేజపరిచింది. తాజా పరిణామాలతో లిబరేషన్ డే తర్వాత పడిన చాలా చైనా స్టాక్స్ తిరిగి పుంజుకున్నాయి.
చైనాతో మరింత సమతుల్య వాణిజ్యాన్ని అమెరికా కోరుకుంటోందని వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ అన్నారు.
వైట్ హౌస్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ డీల్ని "వాణిజ్య ఒప్పందం" గా పేర్కొంది. అయితే ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన లక్ష్యం ఏమిటి? లేదా అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. వాణిజ్య లోటును తగ్గించడం లేదా అంతం చేయాలని చూస్తూ అమెరికా ఈ ఏడాది విధించిన సుంకాలను తొలగించాలని చైనా డిమాండ్ చేస్తూ వస్తోంది.
మార్కెట్లు ఇటీవలి పురోగతి నివేదికలను స్వాగతించినప్పటికీ, సాధ్యమైతే వివరణాత్మక ఒప్పందానికి రావడానికి చాలా సమయం పట్టవచ్చని చరిత్ర సూచిస్తుంది. 2018లో, రెండు పక్షాలు ఒక రౌండ్ చర్చల తరువాత తమ వివాదాన్ని నిలిపివేయడానికి అంగీకరించాయి. కాని యూఎస్ వెంటనే ఆ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. ఇది 2020 జనవరిలో "ఫేజ్ వన్" వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు 18 నెలలకు పైగా మరిన్ని సుంకాలు, చర్చలకు దారితీసింది.
చివరికి, ఆ డీల్లో కుదుర్చున్న కొనుగోలు ఒప్పందాన్ని పాటించడంలో చైనా విఫలమైంది. మహమ్మారి సమయంలో చైనాతో యూఎస్ వాణిజ్య లోటు పెరిగింది. ఇది ప్రస్తుత వాణిజ్య యుద్ధానికి దారితీసింది.
సంబంధిత కథనం