UPI Circle : యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? ఫీచర్స్​ ఏంటి? ఎలా సెటప్​ చేసుకోవాలి?-upi circle launch check out its feature and steps to set up ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi Circle : యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? ఫీచర్స్​ ఏంటి? ఎలా సెటప్​ చేసుకోవాలి?

UPI Circle : యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? ఫీచర్స్​ ఏంటి? ఎలా సెటప్​ చేసుకోవాలి?

Sharath Chitturi HT Telugu
Sep 06, 2024 12:10 PM IST

How to setup UPI Circle ": ఎన్​పీసీఐ లాంచ్​ చేసిన కొత్త యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? దీని ఫీచర్స్​ ఏంటి? యూపీఐ సర్కిల్​ని ఎలా సెటప్​ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి?
యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి?

డిజిల్​ పేమెంట్స్​ని మరింత ప్రోత్సహించేందుకు 'యూపీఐ సర్కిల్​' పేరుతో కొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ). ఈ కొత్త ఫీచర్​తో యూపీఐ యూజర్లు.. తమ కుటుంబసభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్స్​గా యాడ్​ చేసుకోవచ్చు. ప్రైమరీ యూజర్​ బ్యాంక్​ అకౌంట్​ నుంచి వారు ట్రాన్సాక్షన్​ చేసుకోవచ్చు. ఈ యూపీఐ సర్కిల్​ ఫీచర్స్​తో పాటు దానిని ఎలా సెటప్​ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? ఫీచర్స్​ ఎలా ఉంటాయి?

యూపీఐ సర్కిల్​ ద్వారా ప్రైమరీ యూజర్​- తన కుటుంబం లేదా స్నేహితులను తన అకౌంట్​లోనే సెకండరీ యూజర్​గా పెట్టుకోవచ్చు. వారికి ప్రైమరీ అకౌంట్​ నుంచి కొంత "లిమిట్"​లో లావాదేవీలు చేసుకునే ఆప్షన్​ ఇవ్వొచ్చు. ఆ లిమిట్​ని ప్రైమరీ యూజర్​ సెట్​ చేసుకోవచ్చు.

సొంత బ్యాంక్​ అకౌంట్లు లేని వారు, డిజిటల్​ పేమంట్స్​ని ఇంకా మొదలుపెట్టని వారు, ఆన్​లైన్​ పేమెంట్స్​ అంటే భయపడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిందే ఈ యూపీఐ సర్కిల్​. ప్రైమరీ యూజర్​పై ఆర్థికంగా ఆధారపడే సెకండరీ యూజర్లకు ఈ యూపీఐ సర్కిల్​ ఉపయోగపడుతుందని ఎన్​పీసీఐ చెబుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్​ మనీ ఇచ్చేందుకు, సీనియర్​ సిటీజెన్​లకు పిల్లలు సాయం చేసేందుకు, సిబ్బంది డబ్బు అవసరాలను యజమానులు తీర్చేందుకు సైతం ఈ యూపీఐ సర్కిల్​ని వాడుకోవచ్చు.

అయితే ఇందులో తగిన భద్రతా పరమైన ఫీచర్స్​ కూడా ఉన్నాయి. సెకండరీ యూజర్​ని యాడ్​ చేసిన తర్వాత, వారు ప్రతి లావాదేవీపై గరిష్ఠంగా ఎంత వరకు ఖర్చు చేయొచ్చు? అన్న ఆప్షన్​ని ప్రైమరీ యూజర్​ సెట్​​ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ప్రైమరీ యూజర్​ అనుమతులు లేకుండా, లిమిట్​లో సెకండరీ యూజర్​ ట్రాన్సాక్షన్స్​ చేసుకోవచ్చు. అంతేకాదు.. సెకండరీ యూజర్స్​ చేసే ట్రాన్సాక్షన్స్​ని ప్రైమరీ యూజర్​ పర్యవేక్షించవచ్చు.

ప్రస్తుతానికైతే ఈ యూపీఐ సర్కిల్​ నెలవారీ ట్రాన్సాక్షన్​ లిమిట్​ రూ. 15వేలుగా ఉంది. ఒక్క ట్రాన్సాక్షన్​ గరిష్ఠ లిమిట్​ రూ. 5వేలు. అంతేకాదు ప్రైమరీ యూజర్​ యాడ్​ చేసిన 24 గంటల వరకు సెకండరీ యూజర్​ కేవలం రూ. 5వేలు మాత్రమే బదిలీ చేయగలరు.

యూపీఐ సర్కిల్​ ఎలా సెటప్​ చేయాలి?

  • యూపీఐ యాప్స్​లో కనిపించే "యూపీఐ సర్కిల్​" ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • సెకండరీ యూపీఐ ఐడీ ఎంటర్​ చేయండి. లేదా వారి యూపీఐ క్యూఆర్​ కోడ్​ని స్కాన్​ చేయండి. లేదా వారి ఫోన్​ నెంబర్​ని మీ కాంటాక్ట్స్​లో సెర్చ్​ చేసి యాడ్​ చేయండి.
  • Spend With Limits", "Approve Every Payment" ఆప్షన్స్​ ఒకటి ఎంచుకుని పర్మీషన్స్​ సెటప్​ చేయండి.
  • రీక్వెస్ట్​ని ఆమోదించాలని సెకండరీ యూజర్​కి నోటిఫికేషన్​ వెళుతుంది.
  • యాక్సెప్ట్​ చేసన తర్వాత.. ప్రైమరీ యూజర్​ అకౌంట్​ నుంచి సెకండరీ యూజర్​ ట్రాన్సాక్షన్స్​ చేసుకోవచ్చు.

ఒక ప్రైమరీ యూజర్​ గరిష్ఠంగా ఐదుగురిని సెకండరీ యూజర్లుగా యాడ్​ చేసుకోవచ్చు. కానీ సెకండరీ యూజర్​కి మాత్రం ఒక్క ప్రైమరీ యూజరే ఉండాలి.

అవసరమైతే సెకండరీ యూజర్​ని ప్రైమరీ యూజర్​ తొలగించే ఆప్షన్​ కూడా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం