Upcoming Smartphones : ఈ వారం రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. బడ్జెట్ ధరలోనే.. ఓ లుక్కేయండి
Upcoming Smartphones : ఈ వారం కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. బడ్జెట్ ధరలోనే వస్తున్నాయి. ఏయే ఫోన్లు లాంచ్ అవుతున్నాయో చూడండి..
కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకుందామనుకునేవారికి గుడ్‌న్యూస్. ప్రముఖ కంపెనీకి చెందిన కొత్త మొబైల్స్ ఈ వారం భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంట్లో బడ్జెట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మొబైల్‌ల జాబితాలో వివో వై300, రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఎప్పుడు లాంచ్ అవుతాయి? ప్రత్యేకతలు ఏంటి? ఓ లుక్కేద్దాం..
అయితే వివో, రెడ్‌మీ కొత్త ఫోన్‌ల లాంచ్ తేదీని ప్రకటించాయి. రెడ్‌మీ ఏ4 5జీ మొబైల్ నవంబర్ 20న భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. ఒక రోజు తర్వాత నవంబర్ 21 వివో వై300 ఫోన్ భారతదేశంలోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్‌ల ధర, ఇతర వివరాలను తెలుసుకోండి.
రెడ్‌మీ ఏ4
రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్ నవంబర్ 20న విడుదల అవుతుంది. రూ 9,999 వరకు ధర ఉండొచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. షియోమి, క్వాల్‌కామ్ మధ్య ఒప్పందం ప్రకారం ఈ ఫోన్ పరిచయం చేస్తున్నారు. ఈ ఫోన్ ఫోన్ భారతీయ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తయారు చేశారు.
ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ చేయవచ్చు. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 6.68 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ కొత్త మొబైల్‌లో 5160mAh కెపాసిటీ బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందిస్తుంది.
వివో వై300
వివో వై300 ఫోన్ నవంబర్ 21న లాంచ్ కానుంది. కంపెనీ ఈ కొత్త ఫోన్ ధరను 20 వేలపైనే పెట్టే అవకాశం ఉంది. ఈ మొబైల్ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ వస్తుంది. ఫోన్ 6.7-అంగుళాల అమోల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 5000mAh కెపాసిటీ బ్యాటరీతో విడుదల కానుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి, 80W ఫ్లాష్ ఛార్జ్ సదుపాయం అందిస్తుంది. ఐపీ64 రేట్‌తో వస్తుంది.