Upcoming Smartphones : నవంబర్‌లో లాంచ్ అయ్యే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్లు.. ఇందులో మీకు నచ్చే బ్రాండ్ ఉందా?-upcoming smartphones in november poco c75 redmi 14c oppo find x8 and vivo x200 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Smartphones : నవంబర్‌లో లాంచ్ అయ్యే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్లు.. ఇందులో మీకు నచ్చే బ్రాండ్ ఉందా?

Upcoming Smartphones : నవంబర్‌లో లాంచ్ అయ్యే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్లు.. ఇందులో మీకు నచ్చే బ్రాండ్ ఉందా?

Anand Sai HT Telugu
Oct 28, 2024 09:45 PM IST

Upcoming Smartphones : నవంబర్ నెలలో చాలా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ స్టైలిష్ లుక్‌లో రానున్నాయి. ఈ లిస్టులో మీకు నచ్చే బ్రాండ్ ఉందా లేదా చెక్ చేయండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్ కావడంతో మార్కెట్లో ఫోన్ల జాతర నడుస్తోంది. చాలా కంపెనీలు మంచి డిస్కౌంట్ అందిస్తు్న్నాయి. దీపావళి పండుగ తర్వాత కూడా భారత మెుబైల్ మార్కెట్‌లో అలానే వెలగనుంది. ఎందుకంటే నవంబర్ నెలలో చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. కొన్ని ఫోన్లకు సంబంధించిన విడుదల తేదీ ప్రకటించారు. మరికొన్నింటిని కూడా అదే నెలలో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ లిస్టులో రెడ్‌మి, పోకో, రియల్‌మీ, ఒప్పో, వివో వంటి కంపెనీలు ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

పోకో సీ75 5జీ ఫోన్ నవంబర్‌లో విడుదల కానుంది. ఇందులో మెడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5100mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది.

రెడ్‌మీ 14సీ 5జీ ఫోన్ నవంబర్‌లో లాంచ్ అవుతుంది. ఇందులో 8జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ ఉంటుంది. 5060mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఐక్యూ 13 మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రానుంది. ఇది నవంబర్ నెలలో భారతదేశంలో లాంచ్ చేస్తారు. ఈ ఫోన్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇది 6150mAh కెపాసిటీ బ్యాటరీ, 120W ఛార్జింగ్ కలిగి ఉంటుంది. మొబైల్‌లో ఓఎల్ఈడీ ప్యానెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన కెమెరా సెటప్ ఉంటుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తుంది. ఈ మొబైల్ 16జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇది 6500mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్, 8టీ ఎల్‌టీపీవో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఏఐ పవర్ కలిగి ఉంటుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. నవంబర్లో భారత్‌లో విడుదల అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 16జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రానుంది. ఇది 32 మెగాపిక్సెల్ సోనీ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5630mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోని కంపెనీ ప్రారంభించనుంది. ఇందులో మీడియాటెక్ 9400 ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్ రానుంది. ఫోన్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 6.78-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5910mAh కెపాసిటీ బ్యాటరీ అందుబాటులో ఉంటుంది.

వివో ఎక్స్200 సిరీస్ నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 8టీ అమోల్ఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో ఫోన్‌ వస్తుంది. ఈ మొబైల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్200 ప్రోను కూడా విడుదల చేయనున్నారు.

Whats_app_banner