Maruti Suzuki Cars : మారుతి సుజుకి నుంచి రాబోయే సూపర్ కార్లు.. ధర కూడా బడ్జెట్‌లోనే!-upcoming maruti suzuki new cars under budget baleno facelift to suzuki ybd know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Cars : మారుతి సుజుకి నుంచి రాబోయే సూపర్ కార్లు.. ధర కూడా బడ్జెట్‌లోనే!

Maruti Suzuki Cars : మారుతి సుజుకి నుంచి రాబోయే సూపర్ కార్లు.. ధర కూడా బడ్జెట్‌లోనే!

Anand Sai HT Telugu

Maruti Suzuki Cars : మారుతి సుజుకి నుంచి కొన్ని కార్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మధ్యతరగతివాళ్లకు అందుబాటు ధరలో రానున్నాయి. ఆ కార్లు ఏంటో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి కంపెనీకి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ ధరలో కార్లు విక్రయించడం ద్వారా ఈ కంపెనీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఇటీవలే ఆటో ఎక్స్‌పో 2025లో ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మరికొద్ది నెలల్లో ఈ కారు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది వివిధ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఆ లిస్టులో ఏమేం ఉన్నాయో చూద్దాం..

మారుతి సుజుకి ఫ్రాంక్స్

ఈ ఎస్‌యూవీ ఏప్రిల్ 2023 నెలలో ప్రారంభమైంది. మంచి డిజైన్, ఫీచర్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో అమ్ముడైంది. కారును కూడా అప్‌డేట్ చేసి అమ్మకానికి తీసుకువచ్చేందుకు రెడీ చేస్తోంది. కొత్త కారు 2026 లేదా 2027లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందుబాటులో ఉన్న కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర కనిష్టంగా రూ.7.51 లక్షలు, గరిష్టంగా రూ.13.04 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెట్రోల్ అండ్ సీఎన్జీ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు వస్తాయి.

మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. కొత్త ఫేస్ లిఫ్ట్‌లో ఈ కారును పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో హైబ్రిడ్ (పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్) ఇంజన్, అనేక ఫీచర్లను అప్‌డేట్ చేసి తీసుకొస్తు్న్నారు. ప్రస్తుతం దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న సరికొత్త మారుతి సుజుకి బాలెనో ధర కనిష్టంగా రూ.6.66 లక్షలు, గరిష్టంగా రూ.9.83 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను తీసుకొస్తుంది.

మారుతి సుజుకి వైబీడీ

మారుతి సుజుకి వైబీడీ ఎంపీవీని 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వైడీబీ అనేది కారు కోడ్ పేరు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే సుజుకి స్పేసియా తరహాలో ఉంటుందని అంటున్నారు. రూ.6.5 లక్షలు(ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో రావొచ్చని అంచనా.

మారుతి సుజుకి ఈడబ్ల్యూఎక్స్

మారుతి సుజుకి ఈడబ్ల్యూఎక్స్ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇది తయారీ దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. ఈ కారు శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కలిగి ఉండవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వవచ్చు. ధర కూడా అందుబాటులోనే ఉండనుంది.