Upcoming IPO : పెట్టుబడిదారులకు శుభవార్త.. ఈ వారం రానున్న 5 ఐపీఓలు, రెండు లిస్టింగ్‌లు!
Upcoming IPO : ఈ వారం ఐపీఓ పరంగా చాలా బిజీగా ఉండబోతోంది. ఈ వీక్‌లో 5 కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంటున్నాయి. అంతకుముందు జనవరి నెలలో 27 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.7354 కోట్లు సమీకరించాయి. మరోవైపు రెండు కంపెనీలు కూడా ఈ వారం లిస్టింగ్ కానున్నాయి.
మీరు ఐపీఓలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం ఛాన్స్ రాబోతుంది. ఈ వారం ఐపీఓ పరంగా చాలా బిజీగా ఉండనుంది. ఇంకోవైపు రెండు కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి. 5 కంపెనీల ఐపీఓలు సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతాయి. ఆ కంపెనీల వివరాలేంటో చూద్దాం..
చాముండా ఎలక్ట్రికల్స్ ఐపీఓ
కంపెనీ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.47 నుంచి రూ.50గా నిర్ణయించారు. చాముండా ఎలక్ట్రికల్స్ ఐపీఓ ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లు ఐపీఓలో బెట్టింగ్‌కు అవకాశం కల్పించారు. కంపెనీ ఐపీఓ పరిమాణాన్ని రూ.14.60 కోట్లుగా నిర్ణయించింది.
అమ్విల్ హెల్త్‌కేర్ ఐపీఓ
ఈ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.105 నుంచి రూ.111గా నిర్ణయించారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 44.03 లక్షల కొత్త షేర్లు, 10 లక్షల షేర్లను ఐపీఓ జారీ చేయనుంది. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ ఐపీఓ జరగనుంది.
రెడీమిక్స్ కన్‌స్ట్రక్షన్ మెషినరీ ఐపీఓ
ఈ ఐపీఓ పరిమాణం రూ.37.66 కోట్లు. ఐపీఓ ద్వారా ఒక్కో షేరు ధరను రూ.121 నుంచి రూ.123గా నిర్ణయించింది. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు కంపెనీ ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది.
ఎలెగాంజ్ ఇంటీరియర్స్ ఐపీఓ
ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు ఉంటుంది. ఈ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.123-130గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.78.07 కోట్లు సమీకరించనుంది.
కేన్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ
టెక్స్ టైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కేన్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓకు కంపెనీ రూ.94 ధరను నిర్ణయించింది. ఐపీవో పరిమాణం రూ.83.65 కోట్లు. ఈ ఇష్యూలో రూ.58.27 కోట్ల విలువైన 61.99 లక్షల కొత్త షేర్లు, రూ. 25.38 కోట్ల విలువైన 27.00 లక్షల షేర్లను అమ్మకానికి అందించనున్నారు. కార్పోరేట్ మేకర్స్ క్యాపిటల్ లిమిటెడ్ కేన్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉంది. స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి రిజిస్ట్రార్‌గా ఉంది.
రెండు లిస్టింగ్‌లు
మరోవైపు డా.అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 3న పూర్తవుతుంది. ఫిబ్రవరి 5న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది. దీనితోపాటుగా మాల్పని పైప్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 3న పూర్తై.. ఫిబ్రవరి 4న లిస్ట్ అవనుంది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.