Upcoming Hyundai Cars : 2025లో 5 హ్యుందాయ్ కార్ల సందడి.. ఏమేం ఉన్నాయో ఓ లుక్కేయండి!
Upcoming Hyundai Cars 2025 : 2025లో మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లు సందడి చేయనున్నాయి. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో 5 కొత్త కార్లను పరిచయం చేయనున్నారు.
2025 జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఆటోమొబైల్ ప్రియులకు గొప్ప వేదిక కానుంది. ఈ ఈవెంట్‌లో హ్యుందాయ్ కూడా సంచలనం సృష్టించబోతోంది. 2025 సంవత్సరంలో హ్యుందాయ్ 5 ప్రధాన మోడళ్లతో ఈ ఈవెంట్లో సందడి చేయబోతుందని తెలుస్తోంది..
క్రెటా ఈవీ
సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీని ఎక్స్ పో ప్రదర్శించనున్నారు. ఈ కారు కొత్త స్కేట్ బోర్డ్ ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది మెరుగైన బ్యాటరీ ప్యాకేజింగ్, గొప్ప క్యాబిన్ స్పేస్‌ను అందిస్తుంది. 2025 ఆటో ఎక్స్ పోలో ధరలను ప్రకటించే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఫ్లాగ్ షిప్ ఆఫర్లలో క్రెటా ఈవీ ఒకటి.
హ్యుందాయ్ ఐయోనిక్ 5
హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఫేస్ లిఫ్ట్ గ్లోబల్ లాంచ్ మార్చి 2024లో జరిగింది. అయితే ఇది భారతదేశంలో రాబోయే ఈవెంట్‌లో కనిపించే అవకాశం ఉంది. ఇది కొత్త బంపర్ డిజైన్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది.
ఐయోనిక్ 6
హ్యుందాయ్ ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. దీని ఏరోడైనమిక్ డిజైన్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఈ ఈవీ ప్రత్యేకతను పెంచనున్నాయి. ఇది ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ వేరియంట్లలో లభిస్తుంది. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.
ఐయోనిక్ 9
హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని అరంగేట్రం 2024 నవంబర్లో జరిగింది. అయితే ఇది 2025లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందో లేదో తెలియదు. కానీ భారత మార్కెట్ స్పందనను అంచనా వేయడానికి ఈ మోడల్‌ను ప్రదర్శించనున్నారు.
హ్యుందాయ్ టుసాన్
హ్యుందాయ్ టుసాన్ అప్డేటెడ్ మోడల్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 2 పెద్ద ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేలు, కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ సెన్సిటివ్ ప్యానెల్ ఉంటాయి. దీని గ్రిల్, హెడ్ లైట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. కొత్త స్కిడ్ ప్లేట్లు, మెరుగైన అల్లాయ్ వీల్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.