ఈ ఏడాది రెండు నెలల్లో వాహనల ధరలను పెంచిన ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోలోని మోడల్స్‌పై ఆఫర్స్, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో సిట్రోయెన్ ఇండియా సైతం తాజాగా చేరింది. రూ .1.75 లక్షల వరకు ప్రయోజనాలు 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఈ బెనిఫిట్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సిట్రోయెన్ ఈసీ3 ఎంవై23 మోడళ్లపై రూ.80,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది ఈ ఆటోమొబైల్ సంస్థ. భారత మార్కెట్లో ఈ బ్రాండ్ విక్రయించే ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇది! ఈ ఈవీ ధర రూ.12.76 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.41 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఈసీ3 ఫీల్, షైన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 56బీహెచ్పీ పవర్, 143ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఇండియన్ మార్కెట్లో సిట్రోయెన్కి ఉన్న బెస్ట్ సెల్లింగ్ ప్రాడక్ట్స్‌లో ఒకటి ఈ సీ3. ఈ బ్రాండ్ లాంచ్ చేసిన మొదటి కారు ఇదే. లైవ్, ఫీల్, షైన్ అనే మూడు వేరియంట్లలో ఈ హ్యాచ్‌బ్యాక్ లభిస్తుంది. టాప్ ఎండ్ షైన్ వేరియంట్లో కూడా వైబ్ ప్యాక్ లభిస్తుంది. సీ3 ధర రూ.6.16 లక్షల నుంచి రూ.10.15 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 81బీహెచ్పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోచార్జ్డ్ ఇంజిన్ 108బీహెచ్పీ పవర్, 205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిన్ని పొందుతుంది. టర్బో ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌ని పొందుతుంది. ప్రస్తుతం సీ3 కారుపై రూ.లక్ష బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎంవై 23 స్టాక్‌పై రూ .1.75 లక్షల ప్రయోజనాలను అందిస్తోంది. ఎయిర్‌క్రాస్ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.14.55 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఈ ఎస్‌యూవీని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే సంస్థ అందిస్తోంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
సిట్రోయెన్ బసాల్ట్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన కూపే ఎస్యూవీ. 1.70 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ ప్రయోజనాలు ఎంవై 24 స్టాక్‌పై మాత్రమే లభిస్తాయి. దీని ధర రూ.8.25 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
సిట్రోయెన్ వాహనాల బెనిఫిట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీ సమీపంలోని డీలర్షిప్షోరూమ్ని సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం