Income Tax Slabs 2024 Budget: మధ్యతరగతి ప్రజలకు నిరాశ మిగిల్చిన 'బడ్జెట్'!
Income Tax Slabs 2024 Budget: వ్యక్తిగత ఆదాయ పన్ను కొత్త విధానంలోని ట్యాక్స్ శ్లాబులను సవరిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ మొత్తం మీద చూసుకుంటే, ఈ బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలు, పన్నుచెల్లింపుదారులకు నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి.
బడ్జెట్ 2024లో భాగంగా ఇన్‌కమ్ టాక్స్ కొత్త విధానంలో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ని రూ. 50వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. కానీ ఇది పాత పన్ను విధానానికి అమలు కాదని స్పష్టం చేశారు. ఇక నూతన పన్ను విధానంలో కుటుంబ ఫించనుదారులపై ఉండే డిడక్షన్ని రూ. 15వేల నుంచి రూ. 25వేలకు పెంచుతున్నట్టు నిర్మల వెల్లడించారు. ఈ చర్యలతో 4 కోట్ల మంది వేతన జీవులు, ఫించనుదారులకు లబ్ధిచేకూరనుందని అన్నారు.

కొత్త విధానంలో సవరించిన శ్లాబులు..
- రూ. 3లక్షల వరకు- ఎలాంటి ట్యాక్స్ లేదు.
- రూ. 3,00,001 నుంచి రూ. 7,00,000 వరకు- 5శాతం
- రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 10శాతం
- రూ. 10,00,001 నుంచి రూ. 12,00,00 వరకు- 15శాతం
- రూ. 12,00,001 నుంచి రూ. 15,00,000 వరకు- రూ. 20శాతం
- రూ. 15లక్షల కన్నా ఎక్కువ- రూ .30శాతం.
ప్రస్తుత (కొత్త) పన్ను విధానం..
రూ. 3లక్షల వరకు- ఎలాంటి పన్ను ఉండదు.
రూ. 3,00,001 నుంచి రూ. 6,00,00 వరకు- 5శాతం
రూ. 6,00,001 నుంచి రూ. 9,00,000 వరకు- 10శాతం
రూ. 9,00,001 నుంచి రూ. 12,00,000 వరకు - 15శాతం
రూ. 12,00,001 నుంచి రూ. 15,00,000 వరకు- 20శాతం
రూ. 15,00,001 అంతకన్నా ఎక్కువ- 30శాతం.
ప్రతిపాదిత నూతన పన్ను విధానంలో రూ. 7లక్షల వరకు వేతనాలపై 5శాతం పన్ను విధిస్తారు. గతంలోని రూ. 6లక్షల శ్లాబ్‌తో పోల్చుకుంటే రూ.7 లక్షల వరకు జీతాలు ఉన్న వారికి ఇది ఊరటనిచ్చే విషయమే. కానీ రూ. 7లక్షల వేతనం మించిన వారికి ఇప్పటికే రూ. 25వేల వరకు ట్యాక్స్ రిబేట్ అందుబాటులో ఉంది.
ఇక ఆదాయపు పన్ను చట్టం 1961పై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా చదివి, అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుందన్నారు. రానున్న సంవత్సరాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల కోసం పన్ను విధానాలను మరింత సరళీకృతం చేస్తామని నిర్మల అన్నారు. ట్యాక్స్ స్ట్రక్చర్‌ని, నిబంధనలను మరింత సరళతం చేస్తామని స్పష్టం చేశారు.
2023-24 ఆర్థిక ఏడాదిలో మూడింట రెండోవంతు మంది నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్నట్టు బడ్జెట్ 2024లో నిర్మల తెలిపారు. 2024 కోసం వివాద్-సే- విశ్వాస్ స్కీమ్ 3.0ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.
ఎన్పీఎస్ డిడక్షన్‌కి సంబంధించి ఎంప్లాయీ బేసిక్ శాలరీలో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌ని 10శాతం నుంచి 14శాతానికి పెంచింది ప్రభుత్వం. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్తిస్తుంది.
మధ్యతరగతి ప్రజలు, పన్నుచెల్లింపుదారులకు తప్పని నిరాశ!
అయితే ఈ దఫా బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజలు, పన్నుచెల్లింపుదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పన్ను శ్లాబులను సవరించి ప్రభుత్వం ఊరటనిస్తుందని భావించారు. అంతేకాకుండా 2014 నుంచి మార్పులు లేకుండా కొనసాగుతున్న సెక్షన్ 80సీ లిమిట్‌ని సవరిస్తారని అంచనాలు ఉన్నాయి. కానీ ఇవేవీ ప్రకటించకుండానే నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
ఇక బడ్జెట్ ముగిసిన వెంటనే నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. #WorstFM ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది.
సంబంధిత కథనం