Budget 2023: ప్రజాకర్షకమా.. ఆర్థిక వృద్ధి వైపా!: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్-union budget 2023 finance minister nirmala sitharaman will present budget in parliament today know these key points ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Union Budget 2023 Finance Minister Nirmala Sitharaman Will Present Budget In Parliament Today Know These Key Points

Budget 2023: ప్రజాకర్షకమా.. ఆర్థిక వృద్ధి వైపా!: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2023 08:36 AM IST

Budget 2023: కేంద్ర బడ్జెట్ నేడు పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Budget 2023: ప్రజాకర్షకమా.. ఆర్థిక వృద్ధి వైపా!: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
Budget 2023: ప్రజాకర్షకమా.. ఆర్థిక వృద్ధి వైపా!: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ (PTI)

Budget 2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం మొదలుకానుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఎన్నికల ఏడాది ముందు ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ తీసుకొస్తుందా.. ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిస్తుందా అనే ఉత్కంఠ ఉంది. కాగా, వరుసగా ఐదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‍ను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నారు. ప్రధాన వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

వృద్ధి వైపే మొగ్గు!

Union Budget 2023: వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో సమతూకంతో కేంద్ర బడ్జెట్‍ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనా. అయితే మరీ ఎక్కువగా ప్రజాకర్షకంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపైనే బడ్జెట్‍లో కేంద్రం ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. కొవిడ్-19 సంక్షోభం తర్వాత ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రధానమైన పాలసీలు ఉంటాయని అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి కోసం చర్యలు ఉండొచ్చు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో రైతులు, గ్రామీణ ప్రజల కోసం కొన్ని ఆకర్షణీయమైన పథకాలను కేంద్ర ఈ బడ్జెట్‍లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉండగా.. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్రం ఈ బడ్జెట్‍లో ఆర్థిక వృద్ధివైనే ఎక్కువ ఫోకస్ చేస్తుందని అంచనా.

Union Budget 2023 - Stock Market: కేంద్ర బడ్జెట్‍ను దేశీయ స్టాక్ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయి. అదానీ గ్రూప్‍పై హిండెన్‍బర్గ్ ఆరోపణలతో ఇటీవల మార్కెట్‍లలో ఒక్కసారిగా కదుపు వచ్చింది. ఈ కేంద్ర బడ్జెట్ మార్కెట్ సూచీలకు ఊపిరిలూదుతుందని మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏఏ రంగాలపై ఈ బడ్జెట్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని ఆసక్తిగా ఉన్నారు. మొత్తంగా, బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదొడుకులతో కదలాడే అవకాశం ఉంది. చివరకు ఏదో ఒక దశలో పెద్ద మూవ్ ఉండొచ్చు.

Union Budget 2023: ఆదాయ పన్ను మినహాయింపు గురించి మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదాయ పన్ను మినహాయింపును రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాలని ఆకాంక్షిస్తున్నారు. పీఎల్ఐ స్కీమ్ కింద మరిన్ని ప్రోత్సాహకాలను పారిశ్రామిక రంగం ఆశిస్తోంది. జీఎస్‍టీ మినహాయింపును కొన్ని రంగాలు అంచనా వేస్తున్నాయి.

Union Budget 2023 మేకిన్ ఇండియా, అత్మనిర్భర్ భారత్ కింద దేశంలో ఉత్పత్తి రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్‍లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సంస్థలను మరింత ఆకర్షించొచ్చు. మాన్యుఫాక్యరింగ్ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారే దిశగా కొన్ని చర్యలు ఉండొచ్చు.

కొవిడ్-19 దెబ్బ నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ సెక్టార్.. కొన్ని పథకాలు, పన్ను మినహాయింపులను ఆశిస్తోంది. వైద్య రంగంలో కేటాయింపులపై కూడా ప్రత్యేక దృష్టి ఉండనుంది.

2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుంది ఎకానమిక్ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం ఉండనున్న వృద్ధి.. వచ్చే ఏడాది 6.5కు తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంతో జీడీపీ వృద్ధికి ప్రత్యేక చర్యలను కేంద్రం చేపట్టే అవకాశం ఉందని అంచనా.

WhatsApp channel

సంబంధిత కథనం