భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ (Ultraviolette X47 Crossover) ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.74 లక్షలుగా ఉంది. అయితే, తొలి 1,000 మంది వినియోగదారులకు ఈ బైక్‌ను రూ. 2.49 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌కు బుకింగ్‌లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయి.
ఈ బైక్ లేజర్ రెడ్, ఎయిర్‌స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని డిజైన్ అడ్వెంచర్ టూరర్, స్ట్రీట్‌ఫైటర్ బైక్ కలయికలా కనిపిస్తుంది. ఎఫ్77 ఆర్కిటెక్చర్‌పై నిర్మించినప్పటికీ, ఇందులో కొత్త ఛాసిస్, సబ్‌ఫ్రేమ్ వాడారు. దూకుడుగా కనిపించే ఈ బైక్‌లో బీక్-స్టైల్ ఫెండర్, ట్యాంక్, అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌తో కూడిన టెయిల్ సెక్షన్ వంటివి ఉన్నాయి.
స్టాండర్డ్ వెర్షన్‌తో పాటు, ఒక స్పెషల్ ఎడిషన్ డెసర్ట్ వింగ్ వేరియంట్ కూడా ఉంది. ఇందులో వెనుక లగేజ్ ర్యాక్, శాడిల్ స్టేలు, సాఫ్ట్ లేదా హార్డ్ పానియర్స్ వంటివి స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా వస్తాయి.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఐదు కీలక ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
ఈ బైక్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఈ టెక్నాలజీ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్, వెనుక నుంచి వచ్చే ప్రమాదాన్ని హెచ్చరించే ఫీచర్లను అందిస్తుంది. ఇవి బైకర్ భద్రతను మరింత పెంచుతాయి.
ఎక్స్47 క్రాసోవర్ బైక్‌లో ముందు, వెనుక భాగాలలో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇవి డ్యాష్‌క్యామ్‌లుగా పనిచేస్తాయి. ఈ కెమెరా సెటప్ ఆప్షనల్‌గా లభించే డ్యూయల్ డిస్‌ప్లేతో అనుసంధానం అవుతుంది. దీని ద్వారా ముందు, వెనుక కెమెరాల లైవ్ ఫీడ్‌ను చూడవచ్చు.
ఈ బైక్‌లో మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్, తొమ్మిది స్థాయిల బ్రేక్ రీజెనరేషన్, అలాగే డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి బైక్ రైడింగ్ సామర్థ్యాన్ని, రైడర్ భద్రతను మెరుగుపరుస్తాయి.
ఎక్స్47 క్రాసోవర్ బైక్ 7.1 kWh, 10.3 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. దీనిలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 40 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 100 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 211 కి.మీ, పెద్ద ప్యాక్ 323 కి.మీల రేంజ్‌ను అందిస్తాయి.
అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 2.7 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే, 0-100 కి.మీ వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 145 కి.మీగా ఉంది.