ప్రీమియం, లాంగ్ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ స్కూటర్ మీకు బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ విడుదలైన వెంటనే మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.20 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేశారు. అయితే ఈ ధర 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే.
ఇప్పుడు దాని బుకింగ్‌లు దాటిపోయాయి. దీని ధర 1.45 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభవుతుంది. ఈ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, డిజైన్, రేంజ్ గురించి తెలుసుకుందాం.. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇది ఐడీసీ క్లెయిమ్ చేసిన రేంజ్. దీనికి 20 హెచ్‌పీ శక్తిని అందించడానికి ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 125 కి.మీ. ఇది హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్.
అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫైటర్ జెట్ నుండి ప్రేరణ పొంది రూపొందించారు. ఫ్లోటింగ్ డీఆర్ఎల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఇది 3 రంగుల ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. కొత్త టెస్రాక్ట్‌లో విండ్‌స్క్రీన్, 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ వస్తుంది. 14-అంగుళాల వీల్స్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఓవర్‌టేక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, రియర్ కొలిషన్ అలర్ట్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, హ్యాండిల్‌బార్‌పై హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సీటు కింది భాగంలో 34 లీటర్ స్టోరేజ్ ఉంది. ఓవర్‌టెక్ అలర్ట్, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్ ఉన్నాయి. ప్రమాద సమయంలో హెచ్చరించేందుకు ముందు, వెనక రాడార్‌లు కూడా ఉంటాయి. దీనికి ముందు, వెనక డిస్క్ బ్రేక్‌లు ఏర్పాటు చేశారు. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉన్నాయి.