Ultraviolette F77 Electric Bike: మరో రెండు రోజుల్లో అల్ట్రావయ్‍లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. సూపర్ లుక్‍తో..-ultraviolette f77 electric bike ready to launch in india on november 24 know the details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ultraviolette F77 Electric Bike Ready To Launch In India On November 24 Know The Details

Ultraviolette F77 Electric Bike: మరో రెండు రోజుల్లో అల్ట్రావయ్‍లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. సూపర్ లుక్‍తో..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2022 10:33 PM IST

Ultraviolette F77 Electric Bike: స్పోర్టీ లుక్‍తో అదిరిపోయేలా ఉన్న అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ ఈనెల 24న భారత్‍లో లాంచ్ కానుంది. ఈ తరుణంలో ఈ బైక్ గురించి ఇప్పటి వరకు వెల్లడైన విషయాలు ఇవే.

Ultraviolette F77: మరో రెండు రోజుల్లో అల్ట్రావయ్‍లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
Ultraviolette F77: మరో రెండు రోజుల్లో అల్ట్రావయ్‍లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ (HT_Photo)

Ultraviolette F77 Electric Bike: ఎంతగానో నిరీక్షిస్తున్న ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఇండియాలో లాంచ్ కానుంది. ఈనెల 24వ తేదీన ఈ ఎలక్ట్రిక్ బైక్ అడుగుపెట్టనుంది. ముఖ్యంగా స్పోర్టీ లుక్‍తో ఈ బైక్ డిజైన్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీంతో పాటు ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఎఫ్77 రీసెర్చ్, డెవలప్‍మెంట్ కోసం ఐదు సంవత్సరాలు వెచ్చించినట్టు అల్ట్రావయ్‍లెట్ ఆటోమోటివ్స్ పేర్కొంది. ఈ సంస్థలో టీవీఎస్ కూడా భాగస్వామిగా ఉంది. కాగా, రూ.10,000 టోకెన్ అమౌంట్‍తో ఇప్పటికే Ultraviolette F77 Electric Bike బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. 24న మార్కెట్‍లో లాంచ్ కానుంది.

Ultraviolette F77 Electric Bike: తక్కువ బరువు ఉండే ఫ్రేమ్‍తో..

రోడ్‍పై హ్యాండ్లింగ్, హై స్పీడ్ రన్ కోసం అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్.. లైట్‍వెయిట్ ఫ్రేమ్‍ను కలిగి ఉంది. ఆవిష్కరించినప్పటి కంటే ఇంకా 30 శాతం తేలికగా, మరింత స్టిఫ్‍గా ఫ్రేమ్‍తో ఎఫ్77ను ఇప్పుడు తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.

Ultraviolette F77 Electric Bike: 300 కిలోమీటర్లకు పైగా రేంజ్

ఫిక్స్డ్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో Ultraviolette F77 Electric Bike రానుంది. ఈ బ్యాటరీ అత్యధిక ఎనర్జీ డెన్సిటీతో వస్తుందని, ఇంతకు ముందు ప్రకటించిన దాని కంటే ఎక్కువ పవర్ అవుట్‍పుట్, రైడింగ్ రేంజ్‍ను అందిస్తుందని అల్ట్రావయ్‍లెట్ ప్రకటించింది. అల్యూమినియమ్ కేసింగ్‍లో బ్యాటరీని పొందుపరచనున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఐదు లెవెల్స్ సెఫ్టీ, పాసివ్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో ఈ బ్యాటరీ వస్తోంది.

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే Ultraviolette F77 Electric Bike.. 307 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అత్యధిక ఎనర్జీ డెన్సిటీ ఉన్న బ్యాటరీ, మెరుగైన ఇంజినీరింగ్ వల్లే ఇంత అత్యధిక రేంజ్ సాధ్యమైందని అల్ట్రావయ్‍లెట్ కంపెనీ పేర్కొంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు 24న లాంచ్ తర్వాత బయటికి రానున్నాయి.

WhatsApp channel