Fastest mobile Internet : మొబైల్​ ఇంటర్నెట్​ స్పీడ్​లో టాప్​-20లో కూడా లేని భారత్​!-uae leads in fastest mobile internet see where india ranks and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fastest Mobile Internet : మొబైల్​ ఇంటర్నెట్​ స్పీడ్​లో టాప్​-20లో కూడా లేని భారత్​!

Fastest mobile Internet : మొబైల్​ ఇంటర్నెట్​ స్పీడ్​లో టాప్​-20లో కూడా లేని భారత్​!

Sharath Chitturi HT Telugu
Dec 30, 2024 06:04 AM IST

ఫాస్టెస్ట్​ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్​ ఉన్న దేశాల్లో యూఏఈ టాప్​లో నిలిచింది. భారత్​ మాత్రం టాప్​ 20లో కూడా లేదు! పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్​ స్పీడ్​లో టాప్​-20లో కూడా లేని భారత్​!
ఇంటర్నెట్​ స్పీడ్​లో టాప్​-20లో కూడా లేని భారత్​! (Pexels)

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతుండడంతో వేగం, కనెక్టివిటీ విషయంలో కొన్ని దేశాలు ఇతరులను వెనక్కి నెట్టేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలు ర్యాంకింగ్స్​లో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కారణాల వల్ల అమెరికా, భారత్ వంటి దేశాలు అధిక మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని సాధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి! ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ వేగం క్రమంగా పెరుగుతోంది. ఇది డిజిటల్ పరివర్తనను నడిపించడంలో సహాయపడుతుంది.

yearly horoscope entry point

2024 అక్టోబర్​లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 5.52 బిలియన్లకు చేరుకుంది! ఇది అంతకుముందు సంవత్సరం కంటే 151 మిలియన్లు ఎక్కువ. కమ్యూనికేషన్, వ్యాపారం, యాక్సెస్​ టు ఇన్ఫర్మేషన్​కి ఇంటర్నెట్ అంతర్భాగం కావడంతో, మొబైల్ ఇంటర్నెట్ కేంద్ర బిందువుగా మారింది! ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు స్మార్ట్​ఫోన్ల ద్వారా కనెక్ట్ అయ్యారు. ఏదేమైనా మొబైల్ ఇంటర్నెట్ వేగం దేశాల్లో గణనీయంగా మారుతోంది. కొన్ని దేశాలు సరికొత్త స్పీడ్​ బెంచ్​మార్క్​ని ఏర్పరుస్తుంటే, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి.

ఫాస్టెస్ట్​ మొబైల్​ ఇంటర్నెట్​- టాప్​ 10 దేశాలు..

స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. మిడిల్​ ఈస్ట్​, ఆసియా అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న దేశాలకు నిలయంగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సగటున 442 ఎంబీపీఎస్ మొబైల్ స్పీడ్​తో ప్రపంచ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణం డిజిటల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, అధునాతన 5జీ నెట్వర్క్​లో భారీ పెట్టుబడులు. ఖతార్ 358 ఎంబీపీఎస్ వేగంతో రెండో స్థానంలో, కువైట్ 264 ఎంబీపీఎస్ వేగంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక బల్గేరియా, డెన్మార్క్​లు వరుసగా 172 ఎంబీపీఎస్, 162 ఎంబీపీఎస్ మొబైల్​ ఇంటర్నెట్​ స్పీడ్​లో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, నార్వే, చైనా, లక్సెంబర్గ్ టాప్ 10లో ఉన్నాయి. విస్తృతమైన 5జీ నెట్వర్క్ ఉన్న దక్షిణ కొరియా 148 ఎంబీపీఎస్ వద్ద ఉండగా, 5జీ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించిన చైనా 139.58 ఎంబీపీఎస్ వద్ద కొనసాగుతోంది.

గ్లోబల్ మొబైల్ ఇంటర్నెట్ ర్యాంకింగ్స్​లో భారత్ స్థానం..

900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 25వ స్థానంలో ఉంది! దేశంలో సగటు మొబైల్ డౌన్​లోడ్ వేగం 100.78 ఎంబీపీఎస్ కాగా, అప్​లోడ్ వేగం 9.08 ఎంబీపీఎస్​గా ఉంది. వేగం మెరుగుపడినప్పటికీ, డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భారతదేశం ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కనెక్ట్ చేయడంలో మొబైల్ ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోంది. దాని వేగవంతమైన వృద్ధి మందగించే సంకేతాలను చూపించడం లేదు. దేశాలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నందున, ఇంటర్నెట్ వేగం మెరుగుపడే అవకాశం ఉంది. ఇది ప్రపంచ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం