Earn with Twitter: ఇక ట్విటర్ కంటెంట్ తో కూడా సంపాదించుకోవచ్చు.. ఎలా అంటే..?-twitter users can now offer paid subscriptions says elon musk ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Earn With Twitter: ఇక ట్విటర్ కంటెంట్ తో కూడా సంపాదించుకోవచ్చు.. ఎలా అంటే..?

Earn with Twitter: ఇక ట్విటర్ కంటెంట్ తో కూడా సంపాదించుకోవచ్చు.. ఎలా అంటే..?

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 02:41 PM IST

Earn with Twitter: షార్ట్ మెసేజింగ్ యాప్ ట్విటర్ (Twitter) ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులతో వార్తలలో నిలుస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా, మరో నిర్ణయం తీసుకున్నారు. కంటెంట్ క్రియేటర్లు ఇకపై ట్విటర్ వేదికగా కూడా ఆదాయం పొందవచ్చని ప్రకటించారు.

ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్
ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ (REUTERS)

Earn with Twitter subscription: షార్ట్ మెసేజింగ్ యాప్ ట్విటర్ (Twitter) ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులతో వార్తలలో నిలుస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా, మరో నిర్ణయం తీసుకున్నారు. కంటెంట్ క్రియేటర్లు ఇకపై ట్విటర్ వేదికగా కూడా ఆదాయం పొందవచ్చని ప్రకటించారు. తమ అకౌంట్లకు సబ్ స్క్రైబ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా కంటెంట్ ను మార్కెట్ చేసుకుని ఆదాయం పొందవచ్చని వెల్లడించారు.

How to activate Twitter monetization option: సింపుల్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు..

ట్విటర్ (Twitter) కంటెంట్ ను మానిటైజ్ (monitize) చేసుకోవడం చాలా సులభమని మస్క్ (Elon Musk) వివరించారు. ట్విటర్ అకౌంట్లోకి లాగిన్ అయిన తరువాత సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజేషన్ (monitization) ఆప్షన్ ను ఇనేబుల్ చేసుకుంటే సరిపోతుందన్నారు. పెద్ద సైజ్ టెక్స్ట్, గంటల తరబడి ఉన్నవీడియోలను కూడా తమ కంటెంట్ లో భాగం చేసుకోవచ్చన్నారు.కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్లకు సబ్ స్క్రిప్షన్ ఆఫర్ ఇవ్వడం ద్వారా తమ అకౌంట్ ను మానిటైజ్ చేసుకోవచ్చని మస్క్ (Elon Musk) వివరించారు.

Earn with Twitter subscription: ఆదాయంలో వాటా తీసుకోం..

ఈ మానిటైజ్డ్ అకౌంట్ల నుంచి మొదటి 12 నెలలు ఎలాంటి చార్జీలు కానీ, వారు పొందే ఆదాయంలో ఎలాంటి వాటా కానీ తీసుకోబోమని ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. అయితే, 12 నెలల తరువాత ఎలాంటి విధానం అవలంబిస్తారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ప్లాట్ ఫామ్స్ తీసుకునే చార్జీలను మినహాయిస్తే, మిగతా ఆదాయం మొత్తాన్ని కంటెంట్ క్రియేటర్లే తీసుకోవచ్చన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ప్లాట్ ఫామ్స్ సుమారు 30% వరకు చార్జి చేస్తాయి. అంటే సబ్ స్క్రిప్షన్ (subscription) ఆదాయంలో 70% కంటెంట్ క్రియేటర్ పొందవచ్చని, అదే వెబ్ వర్షన్ లో అయితే, 90% కన్నా పైగానే వరకు పొందవచ్చని మస్క్ వెల్లడించారు. క్రియేటర్లు తమ వర్క్ ను ప్రమోట్ చేసుకోవడానికి, ఆదాయం మరింత పెంచుకోవడానికి ట్విటర్ (Twitter) సహకరిస్తుందని ఒక ట్వీట్ లో మస్క్ (Elon Musk) వెల్లడించారు.

ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు..

మొదటి 12 నెలలు ఉచితమేనని ప్రకటించినా, 12 నెలల తరువాత ట్విటర్ (Twitter) తరఫున చార్జీలు వసూలు చేసే అవకాశముందని సోషల్ మీడియా మార్కెటింగ్ పై అవగాహన ఉన్న నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది ట్విటర్ కు మంచి ఆదాయ వనరుగా మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ట్విటర్ (Twitter) ను కొనుగోలు చేసిన నాటి నుంచి అటు ఆర్గనైజేషన్ పరంగా, ఇటు ప్రొడక్ట్ పరంగా అనేక సంచలన మార్పులకు ఎలాన్ మస్క్ (Elon Musk) తెరతీశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. బ్లూ టిక్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ పై ప్రయోగాలు చేశారు. తాజాగా, ట్విటర్ లోగో (Twitter) ను సైతం మార్చారు. గత సంవత్సరం ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై మస్క్ (Elon Musk) దృష్టి పెట్టారు.

Whats_app_banner