Twitter: ట్విట్టర్ మరో ట్విస్ట్.. వారికి మళ్లీ ఉచితంగా బ్లూటిక్ ఇస్తోందా!-twitter restoring blue tick for users with 1 million or more followers reports said ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Twitter: ట్విట్టర్ మరో ట్విస్ట్.. వారికి మళ్లీ ఉచితంగా బ్లూటిక్ ఇస్తోందా!

Twitter: ట్విట్టర్ మరో ట్విస్ట్.. వారికి మళ్లీ ఉచితంగా బ్లూటిక్ ఇస్తోందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 23, 2023 03:10 PM IST

Twitter Blue Tick: బ్లూటిక్ విషయంలో ట్విట్టర్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా మంది సెలెబ్రిటీల అకౌంట్లకు మళ్లీ బ్లూటిక్ కనిపిస్తోంది.

Twitter Blue Tick: ట్విట్టర్ మరో ట్విస్ట్.. వారికి మళ్లీ ఉచితంగా బ్లూటిక్ ఇస్తోందా!
Twitter Blue Tick: ట్విట్టర్ మరో ట్విస్ట్.. వారికి మళ్లీ ఉచితంగా బ్లూటిక్ ఇస్తోందా! (Reuters)

Twitter Blue Tick: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ (Twitter).. బ్లూటిక్ విషయంలో మరోసారి గందరగోళానికి గురి చేస్తోంది. ఇటీవల లెగసీ బ్లూటిక్‍(Legacy Blue tick)లను ట్విట్టర్ తొలగించింది. అంటే, ట్విట్టర్ బ్లూ (Twitter Blue) సబ్‍స్క్రిప్షన్ లేని వారందరికీ బ్లూటిక్‍ను తొలగించింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అమితాబ్‍ బచ్చన్, షారూక్ ఖాన్ సహా చాలా రంగాలకు చెందిన అనేక మంది మంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్‍లకు బ్లూటిక్ ఎగిరిపోయింది. బ్లూటిక్ కోసం వారు కూడా ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా ఓ మినహాయింపు తెచ్చినట్టు తెలుస్తోంది. ఒక మిలియన్.. అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్‍ను ఉచితంగా పునరుద్ధరిస్తున్నట్టు తెలుస్తోంది. రోలింగ్ స్టోన్ కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకోకపోయినా ఇప్పటికే కొందరు సెలెబ్రిటీల అకౌంట్‍కు బ్లూటిక్ పునరుద్ధరణ జరిగినట్టు తెలుస్తోంది.

Twitter Blue Tick: ఈనెల 20వ తేదీన లెగసీ బ్లూటిక్‍లను ట్విట్టర్ తీసేయగా.. ఇప్పుడు మళ్లీ చాలా మంది సెలెబ్రిటీల అకౌంట్లకు బ్లూటిక్ కనిపిస్తోంది. క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ప్రముఖ నటులు ఆలియా భట్, షారూక్ ఖాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలీనియర్ బిల్ గేట్స్ సహా చాలా మంది సెలెబ్రిటీల ప్రొఫైల్స్‌కు మళ్లీ బ్లూటిక్ వచ్చింది. బ్లూటిక్ కోసం వారు ఫీజు చెల్లించినందున అకౌంట్లు వెరిఫై అయ్యాయని చూపిస్తోంది. అయితే, వారు ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్నారా.. లేదా అన్న దానిపై స్పష్టత లేదు. మిలియన్.. అంత కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు ఉచితంగా బ్లూటిక్ వెరిఫికేషన్‍ ఇచ్చేందుకు ట్విట్టర్ నిర్ణయించుకుందని, అందుకే మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీల ఖాతాలకు మళ్లీ బ్లూటిక్ కనిపిస్తోందని రిపోర్టులు వచ్చాయి. అయితే, ట్విట్టర్ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి ట్విట్టర్ ఇదైనా ఉంచుతుందా లేదా.. మళ్లీ విధానం మారుస్తుందా చూడాలి.

Twitter Blue Tick: రెండు రోజుల క్రితం తొలగించిన వెరిఫైడ్ బ్లూటిక్ తన అకౌంట్‍కు మళ్లీ వచ్చిందని ప్రముఖ జర్నలిస్ట్ రానా అయ్యుబ్ ట్వీట్ చేశారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్‌కు సూచించారు. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ బ్లూటిక్ విషయంపై ట్వీట్ చేశారు. “నేను ట్విట్టర్ బ్లూ కోసం చెల్లించాను. వెరిఫికేషన్ కోసం ఓ ఫోన్ నంబర్ ఇచ్చాను. అయితే అది ఇంకా వెరిఫై కాలేదు. నా కోసం కూడా మీరే పే చేస్తున్నారా మస్క్?” అని ఒమర్ అబ్దుల్లా పోస్ట్ చేశారు.

Twitter Blue Tick: దివంగతులైన కొందరి ట్విట్టర్ ఖాతాలకు కూడా ఆటోమేటిక్‍గా ట్విట్టర్ బ్లూ టిక్ పునరుద్ధరణ జరిగింది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‍పుత్, ఇర్ఫాన్ ఖాన్, మైకేల్ జాక్సన్, బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్ సహా చాలా మంది అకౌంట్లకు మళ్లీ బ్లూటిక్ కనిపిస్తోంది.

Twitter Blue Tick: మిలియన్.. అంతకంటే ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు ట్విట్టర్ బ్లూటిక్‍ను ట్విట్టర్ ఉచితంగా కొనసాగిస్తుందా.. లేకపోతే మళ్లీ ఏదైనా మార్పులు చేస్తుందా అనేది చూడాలి.

Whats_app_banner