Elon Musk apple tweet : ఎలాన్ మస్క్- యాపిల్ మధ్య 'ట్విట్టర్' వార్..!
Elon Musk Apple tweet : ప్రముఖ టెక్ సంస్థ యాపిల్‌తో ఎలాన్ మస్క్ యుద్ధానికి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ట్విట్టర్ విషయంలో యాపిల్ ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు.
Elon Musk apple tweet : ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌పై అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాపిల్ విధానాలకు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేశారు. ఐఫోన్ తయారీ సంస్థ.. తన యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్‌ను తప్పిస్తానని బెదిరిస్తున్నట్టు ఆరోపించారు.
"యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్‌ను తీసేస్తామని యాపిల్ బెదిరిస్తోంది. కారణాలు మాత్రం చెప్పడం లేదు," అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
యాప్ స్టోర్ లావాదేవీల్లో యాపిల్‌కు 30శాతం ఫీజు చెల్లించాలన్ని నిబంధనపై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మస్క్ కూడా చేరినట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాలపై యాపిల్ ఇంకా స్పందించలేదు.
Elon Musk vs Apple : మరోవైపు.. ట్విట్టర్‌కు యాపిల్ యాడ్లు ఇవ్వడం తగ్గించేసిందని మస్క్ అన్నారు.
"ట్విట్టర్లో యాడ్లను యాపిల్ చాలా వరకు తగ్గించేసింది. అమెరికాలో ఫ్రీ స్పీచ్ ఉండటం ఆ సంస్థకు నచ్చదా? ఏం జరుగుతోంది టిమ్ కుక్?" అని ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. టిమ్ కుక్.. ప్రస్తుత యాపిల్ సీఈఓ.
వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 2022 తొలి మూడు నెలల్లో.. ట్విట్టర్లో యాడ్స్ కోసం 48మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది యాపిల్ సంస్థ. ట్విట్టర్ యాడ్స్‌లో యాపిల్ వాటా 4శాతంగా ఉంది. మొత్తం మీద.. ట్విట్టర్‌కు టాప్ అడ్వర్టైజర్‌గా కొనసాగింది ఈ టెక్ సంస్థ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్టు కనిపిస్తోంది.
Elon Musk twitter latest news : ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. సంస్థలో కీలక మార్పులు చేపట్టారు. ఉద్యోగాలను భారీగా తొలగించారు. అదే సమయంలో సంస్థ విధానాల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ట్విట్టర్. చాలా మంది.. మస్క్ చర్యలను వ్యతిరేకిస్తుండటం గమనార్హం. అయితే.. ఎలాన్ మస్క్ చర్యలు పెట్టుబడిదారులకు సంతృప్తికరంగా ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"ట్విట్టర్ కోసం ఎలాన్ మస్క్.. ఇప్పటికే టెస్లా షేర్లు చాలా అమ్మేశారు. ఇప్పుడు ట్విట్టర్‌ను నడిపించేందుకు.. ఇంకా అమ్మకాలు చేయక తప్పేడట్టు లేదు! ఈ సమయంలో.. యాపిల్‌తో ఎలాన్ మస్క్ యుద్ధానికి దిగుతుండటం అంతా మంచిది కాదు. పెట్టుబడిదారులు ఈ పరిణామాలతో సంతృప్తికరంగా ఉండరు. వాల్ స్ట్రీట్‌కు తక్కువ డ్రామా కావాలి. కానీ ట్విట్టర్, ఎలాన్ మస్క్‌ను చూస్తుంటే.. బేర్లకు ప్రతి రోజు పండుగ వాతావరణంగానే ఉంది," అని వెడ్‌బుష్ సంస్థకు చెందిన డాన్ ఇవెస్ తెలిపారు.
సంబంధిత కథనం