Twitter Blue Subscription: ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్.. చార్జీలు ఇవే
Twitter Blue Subscription: ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా బ్లూ సబ్‍స్క్రిప్షన్‍ను ట్విట్టర్ ప్రవేశపెట్టింది. సబ్‍స్క్రిప్షన్ ధరలను కూడా ప్రకటించింది.
Twitter Blue Subscription: ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ ఇక ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకాలం ఐఓఎస్, వెబ్ యూజర్లకు మాత్రమే ఈ సబ్‍స్క్రిప్షన్ ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‍లకు కూడా ట్విట్టర్ తీసుకొచ్చింది. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ అమలులో ఉన్న దేశాల్లో ఇక ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ చార్జీల వివరాలను ట్విట్టర్ ప్రకటించింది. కొత్తగా వెబ్ యూజర్లకు యాన్యువల్ ప్లాన్‍ను కూడా ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలివే..
సబ్‍స్క్రిప్షన్ ధర ఇదే
Twitter Blue Subscription: ఆండ్రాయిడ్ యూజర్లకు నెలకు ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర 11 డాలర్లు (సుమారు రూ.900) గా ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. ఐఓఎస్ యూజర్లకు కూడా ఇవే చార్జీలు ఉన్నాయి. వెబ్ యూజర్లకైతే బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర నెలకు 8 డాలర్లుగా ఉంది.
Twitter Blue Annual Subscription: ఇక కొత్తగా ట్విట్టర్ వెబ్ యూజర్లకు వార్షిక ప్లాన్‍ను కూడా ఆ సంస్థ తీసుకొచ్చింది. వెబ్ యూజర్లు ఈ ఏడాది బ్లూ సబ్‍స్క్రిప్షన్ ధర 84 డాలర్లుగా ఉంది. ఈ వార్షిక ప్లాన్ తీసుకుంటే వెబ్ యూజర్లకు సంవత్సరానికి 12 డాలర్లు ఆదా అవుతుంది. ఆయా దేశాల కరెన్సీని బట్టి ఈ ధరలు మారుతుంటాయి.
ప్రస్తుతం ఈ దేశాల్లోనే..
Twitter Blue Subscription: ప్రస్తుతం ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్ దేశాల్లో అందుబాటులో ఉంది. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న యూజ్లకు బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా వస్తుంది. భారత్‍లో త్వరలో బ్లూ సబ్‍స్క్రిప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Twitter Blue Subscription Benefits: ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు అన్‍డూ ట్వీట్, బుక్ మార్క్ ఫోల్డర్స్, కస్టమ్ యాప్ ఐకాన్స్, థీమ్స్, కస్టమ్ నేవిగేషన్, రీడర్, లాంగర్ వీడియో అప్‍లోడ్ ఫీచర్లు అదనంగా లభిస్తాయి. కాగా, ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా దక్కుతుంది.
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాక బ్లూ సబ్‍స్క్రిప్షన్ బెనిఫిట్‍లలో బ్లూ వెరిఫికేషన్ టిక్‍ను కూడా యాడ్ చేశారు ఎలాన్ మస్క్ (Elon Musk). గతంలో ప్రభుత్వాలు, సెలెబ్రిటీలు, కంపెనీలు, మీడియా సంస్థలు, ప్రముఖులు లాంటి వెరిఫైడ్ ఖాతాలకు ట్విట్టర్ బ్లూ టిక్ ఉండేది. అయితే బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ దక్కుతుందనేలా మార్పులు తీసుకొచ్చారు మస్క్. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఆయన కైవసం చేసుకున్నారు.