బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- కేటీఎం 390 ఎస్​ఎంసీ ఆర్​కి పోటీగా టీవీఎస్​ కొత్త 2 వీలర్​..!-tvs rts x design patented ahead of launch will rival ktm 390 smc r ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- కేటీఎం 390 ఎస్​ఎంసీ ఆర్​కి పోటీగా టీవీఎస్​ కొత్త 2 వీలర్​..!

బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- కేటీఎం 390 ఎస్​ఎంసీ ఆర్​కి పోటీగా టీవీఎస్​ కొత్త 2 వీలర్​..!

Sharath Chitturi HT Telugu

టీవీఎస్ ఆర్​టీఎస్ ఎక్స్ బైక్​కి సంబంధించిన అప్డేట్​ వచ్చింది. ఈ మోడల్​ పేటెంట్​ని సంస్థ ఫైల్​ చేసింది. ఫలితంగా త్వరలోనే ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

టీవీఎస్​ ఆర్​టీఎస్ ఎక్స్

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టీవీఎస్​ మోటార్​ నుంచి కొత్త బైక్​ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బైక్​ పేరు ఆర్​టీఎస్​ ఎక్స్​. ఈ మోడల్​ని 2025 ఆటో ఎక్స్​పోలో సంస్థ ప్రదర్శించింది. ఇక ఇప్పుడు ఈ బైక్​ పేటెంట్​కి సంస్థ ఫైల్​ చేయడంతో, త్వరలోనే ఈ 2 వీలర్​ లాంచ్​ అవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి, ఆర్​టీఎస్​ ఎక్స్​ లాంచ్ టైమ్​లైన్​పై స్పష్టత లేదు కానీ మార్కెట్​లోకి అడుగు పెట్టిన తర్వాత ఇది కేటీఎమ్ 390 ఎస్ఎంసీ ఆర్​కి గట్టి పోటీని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్​ కొత్త బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త టీవీఎస్​ ఆర్​టీఎస్​ ఎక్స్​ హైలైట్స్​ ఏంటి?

టీవీఎస్​ ఆర్​టీఎస్​ ఎక్స్​ కొత్త 300 సీసీ ఇంజిన్‌ను పొందుతుంది. దీనిని ఆర్​టీ-ఎక్స్​డీ4 అని పిలుస్తారు. ఇది గత సంవత్సరం మోటోసోల్​లో లాంచ్​ అయ్యింది. టీవీఎస్​ ఆర్​టీ- ఎక్స్​డీ4 ఇంజిన్‌లో నాలుగు డ్యుయెల్​ టెక్నాలజీలు ఉంటాయి. ఇది డ్యూయెల్ ఓవర్‌హెడ్ కామ్‌లను డౌన్‌డ్రాఫ్ట్ పోర్ట్‌తో కనెక్ట్​ చేస్తుంది. ఇంజిన్ అధిక రివ్వింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంజిన్‌లో స్ల్పిట్​ ఛాంబర్ క్రాంక్‌కేస్‌లో రెండు ఆయిల్ పంపులు ఉంటాయి. ఇవి లూబ్రికేషన్​, టార్క్‌ని చూసుకుంటాయి. అదనంగా, ఇది డ్యూయెల్ కూలింగ్ జాకెట్ సిలిండర్ హెడ్‌తో అమర్చి వస్తుంది. ఇందులో పైన వాటర్ జాకెట్, కింద ఆయిల్ జాకెట్ ఉంటాయి. ఇది శీతలీకరణను మరింత పెంచుతుంది. ఉన్నతమైన పనితీరుకు దోహదం చేస్తుంది. చివరగా, డ్యూయెల్ బ్రీథర్ సిస్టమ్ ఆయిల్​ కంటామినేషన్​ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఆయిల్​ వినియోగాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం స్థిరమైన పనితీరును అందిస్తుంది.

టీవీఎస్​ కొత్త బైక్​లో ఉన్న ఇంజిన్​ 9,000 ఆర్​పీఎం వద్ద 34 బీహెచ్​పీ పవర్​ని, 7,000 ఆర్​పీఎం వద్ద 28.5 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వాటర్​ అండ్​ ఆయిల్ జాకెట్‌లతో పాటు లిక్విడ్-కూలింగ్‌ను పొందుతుంది. గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. ఇంజిన్ రైడ్-బై-వైర్ థ్రోటల్‌తో వస్తుంది. బై- డైరెక్షనల్​ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంది.

కొత్త ఆర్​టీఎస్​ ఎక్స్​ బైక్​- మరిన్ని వివరాలు..

హార్డ్‌వేర్ పరంగా, టీవీఎస్​ కాన్సెప్ట్ బైక్ కాస్ట్ అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌తో కూడిన మెటీరియల్ ట్రెల్లిస్ మెయిన్ ఫ్రేమ్‌పై రూపొందించడం జరిగింది. ముందు భాగంలో 43 ఎంఎం యూఎస్​డీ ఫోర్క్‌లను పొందుతుంది. వెనుక భాగంలో ఇది సాలిడ్ డై కాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్‌ను కలిగి ఉంటుంది. ఇది నేరుగా మోనోషాక్‌కు అనుసంధానించిఉంటుంది. 180 ఎంఎం ప్రయాణంతో ప్రీ-లోడ్ అడ్జెస్టెబుల్ సస్పెన్షన్ ఈ బైక్​లో ఉంటుంది. బ్రేకింగ్ విధులను ముందు భాగంలో 300 ఎంఎం డిస్క్, 240 ఎంఎం డిస్క్ నిర్వహిస్తాయి.

ఏదేమైనా కొన్నికొన్ని సార్లు ప్రాడక్ట్​ డిజైన్​ని రక్షించుకునేందుకు కూడా సంస్థలు పేటెంట్స్​ని ఫైల్​ చేస్తుంటాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం