TVS Ronin vs Bajaj Avenger: ఈ రెండు 220cc బైక్‍ల్లో ఏది బెస్ట్? ఏ అంశంలో ఎలా ఉన్నాయ్!
TVS Ronin vs Bajaj Avenger: టీవీఎస్ రోనిన్, బజాజ్ అవేంజర్ బైక్‍లను పోల్చి చూస్తే ఏ అంశంలో ఏది అత్యుత్తమంగా ఉందో ఇక్కడ చూడండి.
TVS Ronin vs Bajaj Avenger: భారత మార్కెట్‍లో లాంచ్ అయినప్పటి నుంచి టీవీఎస్ రోనిన్ (TVS Ronin) బైక్ మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా విభిన్నమైన డిజైన్ దీనికి ప్రత్యేకతగా ఉంది. క్రూజర్, స్క్రాంబ్లర్ మిక్స్ చేసినట్టుగా ఈ బైక్ డిజైన్ ఉంది. కాగా, టీవీఎస్ రోనిన్‍కు బజాజ్ అవేంజర్ 220 (Bajaj Avenger 220) బైక్ ముఖ్యమైన పోటీదారుగా ఉంది. ఈ రెండు బైక్‍లను పోల్చి చూస్తే ఏ అంశంలో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
TVS Ronin vs Bajaj Avenger: లుక్స్
పెద్ద విండ్‍షీల్డ్, సింగిల్ పీస్ సీట్, ఫార్వార్డ్ ఫుట్‍పెగ్‍లతో బజాజ్ అవేంజర్ 220 బైక్ సరైన క్రూజర్‌లా ఉంటుంది. మరోవైపు, రోనిన్ డిజైన్ మాత్రం కాస్త విభిన్నంగా ఉంటుంది. మస్కులర్ ఫ్యుయల్ ట్యాంక్, నియో రెట్రో డిజైన్ ఎలిమెంట్‍లను కలిగి ఉంది. క్రూజర్, స్క్రాంబ్లర్ మేళవించిన డిజైన్‍లా ఉంటుంది.
TVS Ronin vs Bajaj Avenger: స్పెసిఫికేషన్లు
టీవీఎస్ రోనిన్ బైక్ 225.9 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను కలిగి ఉంది. 20.1 bhp పవర్,19.3 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్సుతో వచ్చింది. స్లిప్, అసిస్ట్ క్లచ్‍ను కలిగి ఉంది. ఇక, అవేంజర్ 220 బైక్ 220 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను కలిగి ఉంది. ఇది 18.76 bhp పవర్, 17.55 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
TVS Ronin vs Bajaj Avenger: ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, టీవీఎస్ అవేంజర్ 220 బైక్ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, స్పోక్ రిమ్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‍లను కలిగి ఉంది. మరోవైపు, టీవీఎస్ రోనిన్ బైక్ ఎక్కువ ఫీచర్లతో వస్తోంది. బ్లూటుత్ కనెక్టివిటీ, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, అడ్జస్టబుల్ లివర్ గ్రిడ్, అలాయ్ వీల్‍లను రోనిన్ బైక్ కలిగి ఉంది.
TVS Ronin vs Bajaj Avenger: ధర
బజాజ్ అవేంజర్ ధర రూ.1.38లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టీవీఎస్ రోనిన్ బైక్ ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.69లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అవేంజర్‌తో పోలిస్తే రోనిన్ ధర కాస్త ఎక్కువైనా ఎక్కువ ఫీచర్లు, బెటర్ పర్ఫార్మెన్స్ కలిగి ఉంది.