TVS Ronin Special Edition: దీపావళి ప్రత్యేకం.. మార్కెట్లోకి టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్-tvs ronin special edition arrives for the festive season priced at 1 73 lakh rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Ronin Special Edition: దీపావళి ప్రత్యేకం.. మార్కెట్లోకి టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్

TVS Ronin Special Edition: దీపావళి ప్రత్యేకం.. మార్కెట్లోకి టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్

HT Telugu Desk HT Telugu

TVS Ronin Special Edition: కొన్ని ప్రత్యేకతలతో దీపావళికి టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ (TVS Ronin Special Edition) మార్కెట్లోకి వస్తోంది. రెట్రో డిజైన్ లో వినియోగదారులను ఆకట్టుకున్న టీవీఎస్ రోనిన్.. స్పెషల్ ఎడిషన్ ను మరింత డైనమిక్ గా రూపొందించారు.

టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్

TVS Ronin Special Edition: పండుగ సీజన్ లో సాధారణంగా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. వారిని లక్ష్యంగా పెట్టుకుని కొత్త టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ (TVS Ronin Special Edition) ను టీవీఎస్ సంస్థ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర

దీపావళి సందర్భంగా మార్కెట్లోకి తీసుకువస్తున్న రోనిన్ స్పెషల్ ఎడిషన్ (ఎక్స్ షో రూమ్) ధర ను రూ. 1.73 లక్షలుగా నిర్ణయించారు. రెగ్యులర్ ఎడిషన్ తో పోలిస్తే ఇది రూ. 4 వేలు అదనం. ఈ స్పెషల్ ఎడిషన్ (TVS Ronin Special Edition) లో డిజైన్ లో స్వల్ప మార్పులు చేశారు. స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ఈ టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్.. విభిన్న బాడీ గ్రాఫిక్స్‌తో కొత్త నింబస్ గ్రే కలర్ తో ఉంది. ఈ బైక్ ను ట్రిపుల్-టోన్ కలర్ స్కీమ్‌తో గ్రే షేడ్‌ బేస్‌గా రూపొందించారు. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌ల పై తెలుపు, ఎరుపు చారలు ఉంటాయి. రోనిన్ స్పెషల్ ఎడిషన్ లో కూడా ఆకర్షణీయమైన R లోగో ఉంటుంది. వీల్ రిమ్స్, హెడ్‌ ల్యాంప్ బెజెల్ నలుపు రంగులో ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ కు USB ఛార్జర్, వైజర్ మరియు విభిన్నంగా రూపొందించబడిన EFI కవర్‌ వంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి.

మోడ్రన్ ఫీచర్స్- రెట్రో డిజైన్

ఈ లేటెస్ట్ టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ (TVS Ronin Special Edition) ను మోడ్రన్ ఫీచర్స్ ఉన్న రెట్రో డిజైన్ బైక్ గా అభివర్ణించవచ్చు. పూర్తిగా అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో రెట్రో లుక్ తో ఈ బైక్ ను డిజైన్ చేశారు. ఈ బైక్ కచ్చితంగా వినియోగదారులను, బైక్ లవర్స్ ను ఆకర్షిస్తుందని భావిస్తున్నట్లు టీవీఎస్ బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ వ్యాఖ్యానించారు. ఈ స్పెషల్ ఎడిషన్ లో పెద్దగా మెకానికల్ మార్పలేవీ చేయలేదు. ఇందులో 225.9 సీసీ సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,750 ఆర్పీఎం వద్ద 20.1 బీహెచ్పీ పవర్ ను, 3,750 ఆర్పీఎం వద్ద 19.93 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. బైక్ లో 41 ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక వైపున 7-లెవెల్ అడ్జస్ట్మెంట్ మోనోషాక్‌ ఉన్నాయి. ముందు వైపు 300 ఎంఎం, వెనుక వైపు 240 mm డ్యూయల్-ఛానల్ ABS డిస్క్‌ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో T- ఆకారపు LED DRL, LED హెడ్‌ల్యాంప్ లను అమర్చారు. ఈ బైక్ రెయిన్, అర్బన్ అనే రెండు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయి. ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.