జనవరిలో మెుదటి వారంలో అమ్మకాల్లో దూసుకెళ్లిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పటివరకు నంబర్ 1
TVS IQube Electric Scooter : 2024 చివరి నెలలో అంటే డిసెంబర్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత నెలలో బజాజ్ ఆటో ఓలా ఎలక్ట్రిక్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. 2025 జనవరి మెుదటివారంలో మాత్రం టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెుదటి స్థానానికి వచ్చేసింది.
2024 చివరి నెలలో అందరినీ వెనక్కు నెట్టి ముందుకు వచ్చింది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2025 ప్రారంభంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ కూడా పుంజుకోవడం ప్రారంభమైంది. వాస్తవానికి 2025 జనవరి మొదటి వారంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ విభాగంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. అమ్మకాల్లో బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలను అధిగమించింది.
జనవరి మెుదటివారం అమ్మకాలు
జనవరి 8 వరకు టీవీఎస్ మోటార్స్ కంపెనీ 6,144 యూనిట్లు, బజాజ్ ఆటో 4,659 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 3,267 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్ 3,144 యూనిట్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 763 యూనిట్లు, బాగోస్ ఆటో 299 యూనిట్లు, రివోల్ట్ మోటార్స్ 243 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 229 యూనిట్లు, ప్యూర్ ఎనర్జీ 188 యూనిట్లు విక్రయించింది. అంటే టాప్-10 జాబితాలో ఓలా నాలుగో స్థానంలో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే టీవీఎస్, బజాజ్ మధ్య 1,485 యూనిట్ల భారీ వ్యత్యాసం ఉంది.
డిసెంబర్ 2024 అమ్మకాలు
డిసెంబర్ 2024 అమ్మకాలు చూస్తే.. బజాజ్ కంపెనీ ఈవీలు 18 వేల 276తో ముందు ఉంది. దీని తర్వాత 17,212తో టీవీఎస్ రెండో ప్లేస్‌లో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ మెుదటి స్థానం నుంచి పడిపోయి మూడో స్థానానికి చేరుకుంది. డిసెంబర్ అమ్మకాలు 13769గా ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఫీచర్లు
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 7 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్, క్లీన్ యూఐ, ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్లెట్, ఇంట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్స్, ఓటీఏ అప్ డేట్స్, ప్లగ్ అండ్ ప్లే క్యారీ విత్ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ ఆప్షన్లు, 32 లీటర్ల స్టోరేజ్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇది 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఎకో మోడ్‌లో 126 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ ఐక్యూబ్ 5 వే జాయ్ స్టిక్ ఇంటర్యాక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ హెల్త్‌తో క్రియాశీల నోటిఫికేషన్లు, 4జీ టెలిమాటిక్స్, ఓటీఏ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ స్కూటర్ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, అలెక్సాతో వస్తుంది. ఇది 1.5 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్ మెరుగైన నావిగేషన్ సిస్టమ్, టెలిమాటిక్స్ యూనిట్, యాంటీ-థెఫ్ట్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.