TVS Jupiter Sales : టీవీఎస్ జూపిటర్ రికార్డు.. ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా అమ్మకాలు!
TVS Jupiteer Sales : అమ్మకాల్లో టీవీఎస్ జూపిటర్ దూసుకెళ్తోంది. ఈ స్కూటీ 7 మిలియన్ల మార్క్ దాటింది. దేశంలో ఈ స్కూటర్‌కు కస్టమర్లు పెరుగుతున్నారు.
దేశంలో ఎక్కువగా కొనుగోలు చేసే స్కూటర్లలో హోండా యాక్టివా మెుదటి స్థానంలో ఉంది. అయితే తర్వాత టీవీఎస్ కంపెనీ స్కూటర్ల ప్రజల మనసును గెలుచుకుంటున్నాయి. భారతీయులు రెండో ఆప్షన్‌గా టీవీఎస్ జూపిటర్ వైపు చూస్తున్నారు. 2013లో విడుదలైన ఈ మోడల్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో రెండోది. జూపిటర్.. అన్ని వయసుల వారికి మంచి రైడింగ్ అనుభూతి ఇస్తుంది
7 మిలియన్ల అమ్మకాలు
భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 70 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించింది. మొదటగా 110సీసీ మోడల్‌గా పరిచయం చేశారు. తర్వాత 125సీసీ వెర్షన్‌లో మార్కెట్‌లోకి వచ్చింది. గతేడాది నవంబర్ వరకు 71,40,927 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం స్కూటర్ అమ్మకాల 11.48 మిలియన్లలో 62 శాతం జూపిటర్‌దే.
టీవీఎస్ జూపిటర్ ధర
టీవీఎస్ జూపిటర్ మంచి మైలేజ్, పనితీరు, ఫీచర్లతో కూడిన ఫ్యామిలీ స్కూటర్. ఇటీవల మరిన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చారు. టీవీఎస్ జూపిటర్ శ్రేణి ప్రస్తుతం ఏడు వేరియంట్‌లలో ఉంది. నాలుగు 110cc వేరియంట్‌లు, మూడు 125cc వేరియంట్‌లు. బేస్ 110cc మోడల్‌కు రూ. 73,700 నుండి టాప్ ఎండ్ జూపిటర్ 125 స్మార్ట్ XConnect డిస్క్-ఫిట్టెడ్ వేరియంట్‌కి రూ. 90,500 వరకు ధరలు ఉన్నాయి.
టీవీఎస్ జూపిటర్ ఫీచర్లు
టీవీఎస్ జూపిటర్ 110 మోడల్ డాన్ బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, టైటానియం గ్రే మ్యాట్, లూనార్ వైట్ గ్లోస్, మెటియోర్ రెడ్ గ్లోస్ వంటి అనేక రకాల కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. జూపిటర్ 125ను రూపొందించడానికి ఉపయోగించిన అదే ఛాసిస్‌పై ఈ స్కూటర్‌ను తయారుచేసినట్టుగా కంపెనీ పేర్కొంది. టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు ముందు భాగంలో ప్రధాన ఆకర్షణ.
కంపెనీ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లను కూడా ఇచ్చింది. హ్యాండిల్‌బార్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, వివిధ రైడర్‌లకు సరిపోయే సీటు ఎత్తు ఇవన్నీ జూపిటర్‌పై జనాలకు ఇష్టం ఏర్పడేలా చేశాయి. ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, రెండు ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను అమర్చగల అండర్‌సీట్ స్టోరేజ్, ఒక ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉన్నాయి.
టీవీఎస్ జూపిటర్‌లో పూర్తి ఎల్ఈడీ లైటింగ్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్, ఆటో టర్న్ ఇండికేటర్ రీసెట్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, ఇన్ఫర్మేటివ్ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అండ్ టెక్స్ట్ అలర్ట్‌లు, ఫైండ్ మై వెహికల్, వాయిస్ అసిస్ట్, ఫీచర్లు ఉన్నాయి.
2024 టీవీఎస్ జూపిటర్ 110 కొత్త, పెద్ద 113.5సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఆధారితమైనది. ఇది 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 8బీహెచ్‌పీ పవర్, 9.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ అమ్మకాల్లో ఇప్పుడు టీవీఎస్ కొత్త మైలురాయిని దాటింది.
టాపిక్