ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవలి కాలంలో వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది. మార్కెట్లో ఉన్న 2 వీలర్ స్కూటర్స్ చాలా వరకు 45- 55 కి.మీ మైలేజ్‌నే ఇస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక మైలేజ్ కలిగిన ఒక స్కూటర్ ఇండియాలో లాంచ్‌కి రెడీ అవుతోందని మీకు తెలుసా? ఈ స్కూటర్ 226 కి.మీ మైలేజ్ ఇస్తుందని మీకు తెలుసా? టీవీఎస్ మోటార్ కంపెనీ తీసుకొస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్ అయిన జూపిటర్ 125 సీఎన్జీ గురించి, దాని లాంచ్- ధర అంచనాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
2025 జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ టీవీఎస్ జూపీటర్ 125 సీఎన్జీ కాన్సెప్ట్‌ని సంస్థ ప్రదర్శించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది స్టాండర్డ్ జూపిటర్ 125 ఆధారంగా తయారవుతోంది.
ప్రపంచ మార్కెట్లో మొదటి సీఎన్జీ బైక్‌గా బజాజ్ ఫ్రీడమ్ 125 గుర్తింపు తెచ్చుకుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ స్కూటీగా జూపిటర్ 125 సీఎన్జీ నిలుస్తుంది.
కొత్త టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ 1.4 కిలోల సామర్థ్యంతో 9-లీటర్ సీఎన్జీ ట్యాంక్‌ని కలిగి ఉంది. సీఎన్జీ సిలిండర్‌ని సీటు కింద అమర్చారు. సాధారణ జూపిటర్ 125లో అండర్-సీట్ బూట్ ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యాన్ని ఐదు లీటర్ల నుంచి రెండు లీటర్లకు తగ్గించారు. ట్యాంక్ ఇప్పటికీ ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంటుంది. అప్రాన్ వెనుక అమర్చిన బాహ్య ఇంధన ఫిల్లర్ ద్వారా పెట్రోల్ నింపవచ్చు. ఫ్లోర్‌బోర్డ్ ప్రాంతంలో రెండు హుక్‌లు, ఒక స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. ఇది స్కూటర్ కోసం కొన్ని స్టోరేజ్ ఆప్షన్స్‌ని ఇస్తుంది.
స్కూటర్.. ఒక్క కిలో సీఎన్జీకి 84 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ చెప్పింది. మొత్తం మీద చూసుకుంటే.. టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ 226 కిలోమీటర్ల (సీఎన్జీ + పెట్రోల్) మైలేజ్‌ని ఇస్తుందని తెలిపింది. స్విచ్ ఫ్లిక్ వద్ద ఫ్యూయెల్ ఆప్షన్ని ఎంచుకునే ఛాయిస్ ఉటుంది. ఈ స్కూటర్ కిలోమీటరుకు రూ .1 రన్నింగ్ కాస్ట్ ఉంటుందని బ్రాండ్ తెలిపింది.
ఈ స్కూటర్‌కి పవర్ 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి వస్తుంది. ఇది సీఎన్జీతో పనిచేస్తుంది. సీఎన్జీ వెర్షన్ 6,000 ఆర్పీఎం వద్ద 7.1 బీహెచ్పీ పవర్‌ని, 5,500 ఆర్పీఎం వద్ద 9.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కేఎంపీహెచ్.
విజువల్‌గా చూసుకుంటే, స్టాండర్డ్ టీవీఎస్ జూపిటర్ 125కి జూపిటర్ సీఎన్జీ స్కూటర్‌కి పెద్దగా తేడా ఉండదు. కింద సీఎన్జీ సిలిండర్ ఉన్నప్పటికీ సాధారణ జూపిటర్ 125 కంటే సీట్ హైట్ పెద్దగా మారకపోవడం విశేషం.
పలు మీడియా కథనాల ప్రకారం ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అవుతుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 95లక్షల నుంచి రూ. 1లక్షల మధ్యలో ఉండొచ్చు.
అయితే, లాంచ్, ధరకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా గుర్తించాల్సి ఉంది.
సంబంధిత కథనం