iPhone prices: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ ఫోన్లను అప్ గ్రేడ్ చేయాలని యోచిస్తున్న వినియోగదారులు త్వరపడండి. ఎందుకంటే, త్వరలో ఐఫోన్ ల ధరలు 40% వరకు పెరగవచ్చు. అయితే, ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై 54% సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆపిల్ ను క్లిష్ట స్థితిలోకి నెట్టింది. దీని పరికరాలు చాలావరకు చైనాలో తయారవుతాయి. దాంతో అదనపు సుంకాల ప్రభావం ఆపిల్ పై నేరుగా పడుతుంది. ఆ భారాన్ని ఆపిల్ ఎలా మేనేజ్ చేస్తుందనే విషయంపై ఆపిల్ ఉత్పత్తుల ధరలు ఆధరపడుతాయి. ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. అయితే, పూర్తి భారాన్ని ఆపిల్ తీసుకోదని, కస్టమర్లపై ఆ భారం కచ్చితంగా పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.
ట్రంప్ టారిఫ్ ల ప్రభావం కేవలం ఐఫోన్ కు మించి విస్తరించింది. నేటి ప్రపంచీకరణ సప్లై చెయిన్ లో, చాలా ఎలక్ట్రానిక్స్ ప్రపంచవ్యాప్తంగా సేకరించిన విడి భాగాలతో విదేశాలలో అసెంబుల్ చేయబడతాయి. పలు దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల గ్యాడ్జెట్ల తయారీ వ్యయం పెరగడం అనివార్యమవుతుంది. ఫోన్ల నుంచి ల్యాప్ టాప్ ల వరకు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది.
రోసెంబ్లాట్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం, ఐఫోన్ ధరలు 43% వరకు పెరగవచ్చు. ఐఫోన్ 16 ధర 799 డాలర్లు కాగా, దీని ధర 1,142 డాలర్ల వరకు చేరనుంది. ప్రీమియం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర 1,599 డాలర్ల నుంచి సుమారు 2,300 డాలర్లకు పెరగవచ్చు. 599 డాలర్ల వద్ద ప్రారంభమైన తక్కువ ధర ఐఫోన్ 16ఇ కూడా టారిఫ్ విధించిన తర్వాత 856 డాలర్లకు పెరగవచ్చు. ఈ గణాంకాలు టారిఫ్ యొక్క పూర్తి ప్రభావాన్ని ఆపిల్ వినియోగదారులకు బదిలీ చేస్తుందనే అంచనాపై ఆధారపడి ఉన్నప్పటికీ, ధరలు కచ్చితంగా పెరుగుతాయనే దానిపై అందరూ ఏకీభవిస్తారు. టారిఫ్ లు ఉన్నప్పటికీ ఆపిల్ 5% నుండి 10% వరకు మాత్రమే ధరలను పెంచగలదని జినో అంచనా వేసింది.
సంబంధిత కథనం