TRUMP coin : క్రిప్టో మార్కెట్లో ‘ట్రంప్ కాయిన్’ సంచలనం! లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే..
TRUMP meme coin : క్రిప్టోకరెన్సీ మార్కెట్లో “ట్రంప్ కాయిన్” ప్రకంపనలు సృష్టిస్తోంది! లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే 300శాతం పెరిగి 6.76 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ని హిట్ చేసింది.
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ‘ట్రంప్ కాయిన్’ సంచలనం సృష్టిస్తోంది! అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు లాంచ్ అయిన ఈ కాయిన్, కొన్ని గంటల వ్యవధిలోనే 300శాతం పెరిగి ఏకంగా 6.76 బిలియన్ డాలర్ల పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి చేరుకుంది. దీనిని ట్రంప్ కాయిన్ అని, ట్రంప్ మీమ్ కాయిన్ అని, $TRUMP అని పిలుస్తున్నారు. ఈ ట్రంప్ మీమ్ కాయిన్ వాల్యూ అమాంతం పెరిగిపోవడంతో ఇప్పుడు అందరి చూపు దీని మీదే పడింది.

ట్రంప్ మీమ్స్ అంటే ఏమిటి?
ఇవి ఇతర డిజిటల్ కరెన్సీల మాదిరిగానే ఈ ట్రంప్ మీమ్ కాయిన్స్ పనిచేస్తాయి. వీటితో ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు! శనివారం ట్రేడింగ్‌కి రాగా.. ఈ కాయిన్ హై 33.87 డాలర్లుగా నమోదైంది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్, ఎక్స్‌లో ఈ క్రిప్టోకరెన్సీని ప్రకటించారు. తన నాయకత్వానికి, స్థితిస్థాపకతకు సూచిక ఈ ట్రంప్ కాయిన్ అని అభివర్ణించారు. మీమ్ కాయిన్స్, తరచుగా ఇంటర్నెట్ ట్రెండ్స్, వ్యక్తిత్వాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి అంతర్గత విలువను కలిగి ఉండవు కాని ఊహాజనిత ప్రయోజనాల కోసం వీటిలో విస్తృతంగా ట్రెడింగ్ జరుగుతుంది.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గని నాయకుడిని ఈ ట్రంప్ మీమ్ సెలబ్రేట్ చేస్తుందని కాయిన్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. ఇందులో.. 2024 జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం గురించి కూడా ప్రస్తావించడం ఈ కాయిన్స్ ప్రాముఖ్యతను మరింత పెంచింది.
వాస్తవానికి క్రిప్టో కమ్యూనిటీ మొదటిలో ఈ ట్రంప్ కాయిన్ చట్టబద్ధతను, ట్రంప్‌తో దాని అధికారిక సంబంధాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. కుంభకోణాలపై ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. అయితే, ట్రంప్ వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల వినియోగం, గతంలో ట్రంప్ ఎన్ఎఫ్టీ వెంచర్లతో సంబంధం ఉన్న సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ కంపెనీ ప్రమేయం ఉండటంతో ఇన్వెస్టర్లకు భరోసా పెరిగింది.
శనివారం మధ్యాహ్నానికల్లా $TRUMP దాదాపు 6 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషనకు చేరుకుంది. ఇది బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.
భవిష్యత్తు ప్రణాళికలు
అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ప్రారంభ లాంచ్‌లో 200 మిలియన్ $TRUMP మీమ్ కాయిన్లు జారీ అయ్యాయి. వచ్చే మూడేళ్లలో అదనంగా 800 మిలియన్ ట్రంప్ కాయిన్స్‌ని విడుదల చేయనున్నట్లు ఫైట్ ఫైట్ ఫైట్ ఎల్ఎల్సీ (కాయిన్స్‌ని మేనేజ్ చేస్తున్న కంపెనీ) ప్రకటించింది.
ఆర్థిక వివరాలపై అస్పష్టత..
మొదటి బ్యాచ్ మీమ్ కాయిన్ల నుంచి ట్రంప్ ఎంత సంపాదించారో ఆయనతో పాటు ఫైట్ ఫైట్ ఎల్ఎల్సీ ఇంకా వెల్లడించలేదు. కాగా అస్థిరమైన మీమ్ కాయిన్ మార్కెట్లో ఈ కాయిన్ ట్రంప్ ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇన్వెస్టర్లకు ఎలాంటి రిస్క్ ఉంటుంది? అన్న విషయాలపై మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఉన్నారు.
(గమనిక:- క్రిప్టో మార్కెట్ రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.)
సంబంధిత కథనం