Truecaller - WhatsApp: త్వరలో వాట్సాప్‍‍కు కూడా ట్రూకాలర్ సర్వీసెస్: ఉపయోగం ఏంటంటే!-truecaller to make caller id services available on whatsapp calls check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Truecaller To Make Caller Id Services Available On Whatsapp Calls Check Full Details

Truecaller - WhatsApp: త్వరలో వాట్సాప్‍‍కు కూడా ట్రూకాలర్ సర్వీసెస్: ఉపయోగం ఏంటంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 09, 2023 02:17 PM IST

Truecaller - WhatsApp: కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసులను త్వరలో వాట్సాప్‍కు కూడా అందుబాటులోకి తీసుకురానుంది ట్రూకాలర్. దీని వాట్సాప్‍లోనూ స్పామ్ కాల్‍లను గుర్తించవచ్చు.

Truecaller - WhatsApp: త్వరలో వాట్సాప్‍‍కు కూడా ట్రూకాలర్ సర్వీసెస్: ఉపయోగం ఏంటంటే!
Truecaller - WhatsApp: త్వరలో వాట్సాప్‍‍కు కూడా ట్రూకాలర్ సర్వీసెస్: ఉపయోగం ఏంటంటే!

Truecaller - WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ (Truecaller) యాప్‍ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఏదైనా అన్‍నౌన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఈ ట్రూలర్.. ఆ నంబర్ కాలర్ ఐడెంటిఫికేషన్‍ను చూపిస్తుంది. అంటే ఎవరు కాల్ చేస్తున్నారో యూజర్‌కు చూపుతుంది. ముఖ్యంగా స్పామ్ కాల్‍లను గుర్తించేందుకు ఈ ట్రూలర్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు సిమ్ నెట్‍వర్క్‌కు వచ్చే కాల్‍లకే ఈ సదుపాయం ఉంది. కాగా, త్వరలో వాట్సాప్‍(WhatsApp)కు కూడా ట్రూకాలర్ తన కాలర్ ఐడెంటిఫికేషన్ (Caller Identification) సర్వీస్‍ను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఏదైనా అన్‍నౌన్ నంబర్ నుంచి వాట్సాప్‍కు కాల్ వస్తే.. అది స్పామ్ అయితే ట్రూకాలర్ చూపించనుంది. వాట్సాప్‍(WhatsApp)కు త్వరలోనే కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు ట్రూకాలర్ అధికారికంగా ప్రకటించింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Truecaller - WhatsApp: మే ఆఖరు కల్లా వాట్సాప్‍కు కాలర్ ఐడెంటిఫికేషన్ సేవలు ప్రారంభిస్తామని ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మమేడీ వెల్లడించారు.

Truecaller - WhatsApp: వాట్సాప్‍ యూజర్లకు ఇటీవల ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. వివిధ దేశాల కోడ్‍లు ముందున్న నంబర్లతో కాల్స్ వస్తున్నాయని చాలా మంది యూజర్లు తెలుపుతున్నారు. వీటిలో అధికంగా స్పామ్ కాల్స్ ఉంటున్నాయి. యూజర్లను మోసం చేసే లక్ష్యంతో కొందరు సైబర్ నేరస్థులు.. వాట్సాప్ యూజర్లకు ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగించి కాల్స్ చేస్తున్నారు.

+60 (మలేషియా ), +251 (ఇథియోపియా), +62 (ఇండోనేషియా ), +254 (కెన్యా), +84 (వియత్నాం) లాంటి వివిధ దేశాల కోడ్‍లు ముందు ఉండే నంబర్ల నుంచి వాట్సాప్ యూజర్లకు కాల్స్ వస్తున్నాయి. ఇవి స్పామ్ కాల్స్‌గా ఉంటున్నాయి. సైబర్ నేరస్థులు కొందరు.. ఇలాంటి ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ చేసి వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను సేకరించి సైబర్ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Truecaller - WhatsApp: వాట్సాప్‍కు ట్రూకాలర్.. కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వస్తే.. ఇక వాట్సాప్‍కు వచ్చే స్పామ్ కాల్‍లను కూడా సులువుగా గుర్తించవచ్చు. ఆ కాల్స్ లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడొచ్చు. కాగా, వాట్సాప్‍కు ఊహించిన విధంగా ఇంటర్నేషన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఆన్సర్ చేయకూడదు.

ఇండియా సహా చాలా దేశాల్లో ఇటీవల టెలిమార్కెటింగ్, స్కామింగ్ లాంటి స్పామ్ కాల్స్ చాలా అధికమవుతున్నాయి. సుమారుగా ఒక్కో యూజర్‌కు నెలకు 21 వరకు స్పామ్ కాల్స్ వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫిల్టర్లను ఉపయోగించి టెలిమార్కెటింగ్ కాల్స్ యూజర్లకు రాకుండా బ్లాక్ చేయడం ప్రారంభించాలని టెలికం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‍కు ట్రాయ్ సూచించింది. ఇలాంటి పరిష్కారాన్ని అమలు చేసేందుకు టెలికం సంస్థలతో చర్చిస్తున్నామని ట్రూకాలర్ చెప్పింది.

WhatsApp channel

సంబంధిత కథనం