విమానాశ్రయంలో ఈ సాధారణ తప్పులు చేసి ఇబ్బందుల్లో పడకండి!-travel tips these are common flying mistakes in airport never forgot travel insurance visa documents before take off ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  విమానాశ్రయంలో ఈ సాధారణ తప్పులు చేసి ఇబ్బందుల్లో పడకండి!

విమానాశ్రయంలో ఈ సాధారణ తప్పులు చేసి ఇబ్బందుల్లో పడకండి!

Anand Sai HT Telugu

ఎటైనా వెళ్లేటప్పుడు విమానాశ్రయానికి వెళుతున్నట్లయితే చాలా గందరగోళంగా ఫీలవుతాం. ప్రయాణ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం (Twitter)

యట సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసినట్లుగా ఎయిర్‌పోర్ట్ వెళ్లగానే విమానం ఎక్కేయం. చాలా సులభం అని మీరు అనుకోవద్దు. విమానాశ్రయ గేటు నుంచి విమాన సీటు వరకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు భద్రతా తనిఖీ చేయించుకోవలసి ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. కొన్నిసార్లు ప్రయాణికులు ఆలస్యం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విమాన ప్రయాణానికి ముందు కొన్ని విషయాలు చూసుకోవాలి.

  1. విమానంలో ప్రయాణిస్తుంటే, మీకు లేదా మీ లగేజీకి ఎటువంటి నష్టం జరగదని అనుకోవద్దు. సమస్యలు ఎక్కడైనా తలెత్తవచ్చు. కాబట్టి ప్రయాణించే ముందు ప్రయాణ బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. తరచుగా విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణ బీమా తీసుకోకపోవడం అనే పొరపాటు చేస్తారు.
  2. విమానంలో ప్రయాణించబోతున్నప్పుడల్లా ఇంటి నుండి బయలుదేరే ముందు ఎయిర్‌లైన్ యాప్, బోర్డింగ్ పాస్, మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. తద్వారా మీ పనికి అంతరాయం కలగదు. విమానాశ్రయంలో మీ ఇంటర్నెట్ ఆగిపోవచ్చని మీరు అనుకుంటే ముఖ్యమైన విషయాల స్క్రీన్‌షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
  3. ఇతర దేశంలోకి ప్రవేశించడానికి పాస్‌పోర్ట్‌ ఉంటే చాలా అనుకోవద్దు. ఇది ప్రమాదకర పని. చాలా దేశాలు ప్రవేశానికి వేర్వేరు వీసా నియమాలను కలిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు విమానాశ్రయానికి వస్తున్నట్లయితే వీసా సంబంధిత విషయాల గురించి పూర్తి వివరాలతో పాటు పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. ఎందుకంటే తనిఖీ సమయంలో ఈ పత్రాలన్నీ మీ నుండి అడుగుతారు.
  4. భద్రతా తనిఖీ తర్వాత మీరు విమానం ఎక్కినప్పుడు చాలా మంది అక్కడ కూడా కొన్ని తప్పులు చేస్తారు. విమానాలలో యూఎస్‌బీ పోర్టులు అందించినా.. వాటిపై ఆధారపడటం మంచిది. విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు మీ ఫోన్ కోసం పవర్ బ్యాంక్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
  5. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు లేదా సామాన్యులు చాలా బాగా దుస్తులు ధరించి విమానాశ్రయానికి చేరుకోవడం మనం చూస్తుంటాం. కానీ మీరు మీ ప్రయాణానికి అనుగుణంగా దుస్తులను ఎంచుకోవాలి. తద్వారా మీరు వాటిని ధరించి హాయిగా ప్రయాణించవచ్చు. చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించకపోవడం ఉత్తమం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.