Wrong UPI ID Transfer: పొరపాటున వేరే వారికి డబ్బులు పంపించారా?.. ఇలా చేయండి..-transferred money to a wrong upi id here s what you can do ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Transferred Money To A Wrong Upi Id? Here's What You Can Do

Wrong UPI ID Transfer: పొరపాటున వేరే వారికి డబ్బులు పంపించారా?.. ఇలా చేయండి..

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 10:49 PM IST

పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe).. ఇలా కుప్పలు తెప్పలుగా యూపీఐ పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ యూపీఐ లావాదేవీలు అందుబాటులోకి రావడంతో నగదు వాడకం చాలా వరకు తగ్గింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు, ఈ యూపీఐ (Unified Payments Interface UPI) పేమెంట్స్ కస్టమర్లకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్ (QR code), మొబైల్ నెంబర్ పేమెంట్(mobile number payment), డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్(direct bank transfer) వంటి సదుపాయాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో, ఈ ఈజీ పేమెంట్స్ కారణంగా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా Unified Payments Interface UPI ద్వారా పొరపాటున వేరే వారి ఖాతాలోకి డబ్బులు పంపించే ఘటనలు ఎక్కువయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

పొరపాటున పంపిస్తే ఏం చేయాలి?

అనుకోకుండా, యూపీఐ పేమెంట్ల ద్వారా వేరే వారి ఖాతాలోకి డబ్బులు పంపిస్తే ఏం చేయాలనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. డబ్బులు వారి ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ కాగానే, టెన్షన్ పడిపోయి, సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. అలా, ఒకవేళ పొరపాటున వేరే వారి అకౌంట్లోకి యూపీఐ (Unified Payments Interface UPI) ద్వారా డబ్బులు పంపిస్తే ఏం చేయాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కొన్ని సూచనలు చేస్తోంది. అవి..

ఇలా మీ డబ్బును తిరిగి పొందండి

  • పొరపాటున యూపీఐ (Unified Payments Interface UPI) ద్వారా డబ్బులు వేరే వారి ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ అయితే, ముందుగా ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయాలి. పొరపాటున తన ఖాతాలోకి డబ్బును ట్రాన్స్ ఫర్ చేశానని, ఆ మొత్తాన్ని మళ్లీ తనకు రిటర్న్ చేయాలని కోరాలి. మెజారిటీ సందర్భాల్లో డబ్బు పొందిన వ్యక్తి తిరిగిస్తాడు.
  • ఒకవేళ, డబ్బు పొందిన వ్యక్తి నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో, వెంటనే ఏ యూపీఐ(Unified Payments Interface UPI) ద్వారా డబ్బు ట్రాన్స్ ఫర్ చేశారో, ఆ యూపీఐ కస్టమర్ సపోర్ట్ కు ఫోన్ చేసి, విషయం వివరించాలి. పొరపాటున ట్రాన్స్ ఫర్ అయిన డబ్బు తిరిగి వచ్చేలా వారు చూస్తారు.
  • ఒకవేళ, యూపీఐ పేమెంట్స్ వారి నుంచి కూడా సమస్య పరిష్కారం కాని పక్షంలో.. ఆర్బీఐ (Reserve Bank of India) ని సంప్రదించాలి. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఆంబుడ్స్ మ్యాన్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పేరుతో ఒక ప్రత్యేక అధికారిని (ombudsman for digital transactions) ఆర్బీఐ (Reserve Bank of India) నియమించింది. ఆ అధికారికి ఫిర్యాదు చేయడం ద్వారా పొరపాటున బదిలీ చేసిన డబ్బును, నిర్ధారిత సమయంలోపు తిరిగి పొందవచ్చు.
  • ఒకవేళ పొరపాటున వేరే వ్యక్తి నుంచి మీ యూపీఐ ఖాతాలోకి డబ్బు వచ్చినా కూడా.. ఆర్బీఐ కి ఫిర్యాదు చేయాలి.

WhatsApp channel