Mobile Recharge Plans: ట్రాయ్ ఆదేశాలు.. కాలింగ్, ఎస్ఎంఎస్ కోసం ప్లాన్స్ లాంచ్ చేసిన జియో, ఎయిర్‌టెల్
Mobile Recharge Plans: ట్రాయ్ ఆదేశాలతో జియో, ఎయిర్‌టెల్ వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ రీఛార్జ్ ప్యాక్స్ తీసుకొచ్చాయి.
ఇటీవలే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) టెలికాం కంపెనీలకు పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు పలు ప్లాన్లను ప్రకటిస్తు్న్నాయి. తాజాగా వాయిస్ ఓన్లీ, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో భారత అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. జియో రూ.458, రూ.1958 విలువైన రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది.

జియో ఇన్ కాలింగ్, ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లో మీకు ఇంటర్నెట్ లభించదు. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ కోసం మాత్రమే మొబైల్ వాడే యూజర్ల కోసం ఈ ప్లాన్లను తీసుకువచ్చింది. జియోకు చెందిన ఈ రెండు ప్లాన్‌లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. వీటిలో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..
జియో రూ.458 వాల్యూ ప్లాన్
జియో ఎంట్రీ లెవల్ వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్ రూ.458 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, 1,000 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇది కాకుండా మీరు ఈ ప్లాన్లో జియో టీవీ, జియో సినిమా(నాన్ ప్రీమియం), జియోక్లౌడ్ వంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు.
జియో రూ.1958 వాల్యూ ప్లాన్
జియో ఏడాది ప్లాన్.. వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్ ధర ఇప్పుడు రూ.1,958. ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ వాల్యూ ప్లాన్లో మీరు అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇతర ప్రయోజనాలు చూస్తే.. ఇందులో జియో టీవీ, జియో సినిమా(నాన్ ప్రీమియం), జియోక్లౌడ్ వంటి జియో యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.
ట్రాయ్ ఆదేశాలు
కొన్ని రోజులుగా ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే అందించాలని ఆదేశించింది. తద్వారా డేటాను ఉపయోగించని వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు. ట్రాయ్ ఈ నియమం తర్వాత ఇప్పుడు జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే ప్రవేశపెట్టింది. ఇది కేవలం కాలింగ్,ఎస్ఎంస్ఎస్‌ను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఎయిర్‌టెల్ కూడా..
ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ సైతం వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ రీఛార్జ్ ప్యాక్స్‌ని తీసుకొచ్చింది. ఆ వివరాలు..
రూ. 499 ప్లాన్- అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్, 84 రోజుల వాలిడిటీ
రూ. 1959 ప్లాన్- అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్, 365 రోజుల వాలిడిటీ
వీటితో పాటు ఎయిర్‌టెల్ రివార్డ్స్, 3 నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఫ్రీ హెల్లో ట్యూన్ సర్వీస్ కూడా పొందొచ్చు.
టాపిక్