stock market today: ఈ రోజు ట్రేడింగ్ కోసం నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్ ఇవే..
Stocks to buy today: సుప్రీం ఇండస్ట్రీస్, సిమెన్స్, వెస్ట్ లైఫ్ ఫుడ్వరల్డ్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అనే నాలుగు స్టాక్స్ ను ఈ రోజు కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
Stock market today: భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 140 పాయింట్లు నష్టపోయి 22,302 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511 వద్ద ముగియగా, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 609 పాయింట్లు నష్టపోయి 48,285 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండియా విఐఎక్స్ ఇండెక్స్ 2.45 శాతం పెరిగి 17.01 వద్ద ముగిసింది. విఐఎక్స్ వారం రోజుల్లో 35 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈ లో అడ్వాన్స్-క్షీణత నిష్పత్తి 0.40 వద్ద ఉండటంతో షేర్లు క్షీణించాయి. ఇది 2024 ఏప్రిల్ 15 తర్వాత కనిష్ట స్థాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ మినహా అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు ఎరుపు రంగులో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ రియాల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ ఎక్కువగా నష్టపోయాయి.
నిఫ్టీ 50 అవుట్ లుక్
‘నిఫ్టీ 50 సూచీకి తక్షణ నిరోధం 22,400 స్థాయిలో ఉంది. తదుపరి కనిష్ట స్థాయిలను 22,100 నుండి 22,000 వరకు చూడవచ్చు’’ అని హెచ్ డిఎఫ్ సి సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి నిఫ్టీ 50 ఔట్ లుక్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాగే, నిఫ్టీ 50 రానున్న రోజుల్లో మరింత బలహీన పడొచ్చని, దీంతో సూచీ 47700 దిశగా పయనించే అవకాశం ఉందని ఎల్ కెపి సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అభిప్రాయపడ్డారు. ‘‘సానుకూల అంతర్జాతీయ సంకేతాల సహాయంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, కొన్ని ప్రారంభ ఒడిదుడుకుల తరువాత, అస్థిరత సూచీ (ఇండియా విఐఎక్స్) సుమారు 6% పెరగడంతో మార్కెట్ భారీ ప్రాఫిట్ బుకింగ్ లను చూసింది. ఆ తర్వాత ఒడిదుడుకులు తగ్గి సూచీ 22,302 వద్ద ముగిసింది. సాంకేతికంగా చూస్తే గత వారం సూచీ బేరిష్ ను సృష్టించి బలహీనతను సూచిస్తోంది. బేరిష్ క్యాండిల్, 34 రోజుల ఎక్స్ పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ) మద్దతుతో సూచీ కనిష్ట స్థాయికి పడిపోవడం మరింత నిరాశావాదాన్ని సూచిస్తోంది’’ అని స్టాక్ మార్కెట్ నిపుణుడు హృషికేష్ యడ్వే విశ్లేషించారు.
ఈ రోజు ట్రేడింగ్ గైడ్
ఈ రోజు లాభాలను ఆర్జించే అవకాశం ఉన్న స్టాక్స్ పై మార్కెట్ నిపుణులు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా, బొనాంజా పోర్ట్ ఫోలియో టెక్నికల్ ఎనలిస్ట్ విరాట్ జగద్ తమ అంచనాలను వెల్లడించారు. సుప్రీం ఇండస్ట్రీస్, సిమెన్స్, వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్, సీజీ పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లను పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచించారు.
1] సుప్రీం ఇండస్ట్రీస్: కొనుగోలు ధర రూ, 5247; టార్గెట్ ధర రూ. 5555; స్టాప్ లాస్ రూ.5050 .
2] సిమెన్స్: కొనుగోలు ధర రూ, 6094; టార్గెట్ ధర రూ.6444; స్టాప్ లాస్ రూ.5900 .
3] వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్: కొనుగోలు ధర రూ. 880 ; టార్గెట్ ధర రూ.940 ; స్టాప్ లాస్ రూ.860 .
4) సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్: కొనుగోలు ధర రూ. 570 ; టార్గెట్ ధర రూ.610 ; స్టాప్ లాస్ రూ.550 .
సూచన: ఈ విశ్లేషణలో ఇచ్చిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.