Toyota flex fuel hybrid car: ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ఆవిష్కరించిన టయోటా-toyota launches its first flex fuel hybrid car in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Toyota Launches Its First Flex Fuel Hybrid Car In India

Toyota flex fuel hybrid car: ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ఆవిష్కరించిన టయోటా

HT Telugu Desk HT Telugu
Oct 11, 2022 05:37 PM IST

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికిల్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఇంధనాలతో నడిచేవి. అంటే పెట్రోలు, ఇథనాల్ లేదా పెట్రోల్ ఇథనాల్ కలిపి ఉండే ఇంధనం వాడొచ్చు.తాజాగా లాంచ్ అయిన టయోటా కరొలా ఆల్టిస్ హైబ్రిడ్ వాహనం 1.8 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్.

Toyota Corolla Altis Hybrid Flex-fuel car: గడ్కరీ ఆవిష్కరించిన టయోటా ఫ్లెక్సీ ఫ్యూయల్ కారు వద్ద మీడియా ప్రతినిధులు
Toyota Corolla Altis Hybrid Flex-fuel car: గడ్కరీ ఆవిష్కరించిన టయోటా ఫ్లెక్సీ ఫ్యూయల్ కారు వద్ద మీడియా ప్రతినిధులు (PTI)

Toyota flex fuel hybrid car: భారతదేశపు తొలి ఇథనాల్ రెడీ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ కారును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ కార్ పెట్రోల్ లేదా ఇథనాల్, అలాగే పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనం ద్వారా నడుస్తుంది. అలాగే బ్యాటరీ ద్వారా కూడా నడిచే హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ కంటే ఇథనాల్ చౌకగా లభిస్తుంది. తద్వారా ఫ్లెక్స్ ఫ్యుయల్ కార్ ఓనర్లు తమ ఇంధన బిల్లును కాస్త తగ్గించుకోవచ్చు. అలాగే మన దేశం ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుతుంది.

కేంద్రం ఇప్పటికే దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. పెట్రోలు-ఇథనాల్ రేషియో ఆధారంగా వీటిని ఈ95, ఈ90, ఈ85లుగా వీటిని వర్గీకరించారు.

టయోటా కరోలా ఆల్టిస్ హైబ్రీడ్ ఫ్లెక్సీ -ఫ్యూయల్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ టెక్నాలజీ విభాగంలో తొలి వాహనం. అన్ని ముఖ్యమైన సెగ్మెంట్లలో రానున్న 25 సంవత్సరాల పాటు అంతర్జాతీయ అగ్రశ్రేణి ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా ఉండేలా ఈ తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐఏఎం) అధ్యక్షుడు కెనిచి ఆయుకవా తెలిపారు.

పెట్రోల్ కార్స్ కంటే దీని ప్రత్యేకత ఏంటి?

యూఎస్ ఇంధన విభాగం ప్రకారం.. ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికిల్స్ పెట్రోల్ వెహికిల్స్ తరహాలోనే ఉంటాయి. అయితే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికిల్స్ మాత్రం ప్రత్యేక ఇంజిన్ కలిగి ఉండి పెట్రోలు లేదా ఇథనాల్‌తో బ్లెండ్ అయిన పెట్రోలుతో పనిచేస్తుంది. ఇథనాల్‌తో పనిచేసేలా కంపోనెంట్స్ కలిగి ఉంటుంది. తదనుగుణంగా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లో మార్పులు చేస్తారు.

పూర్తి వివరాలకు ఈ కథనం చదవండి: ‘ఫ్లెక్స్​ ఫ్యూయెల్’​ కారు అంటే ఏంటి?

WhatsApp channel

టాపిక్