Toyota Land Cruiser 300 : రూ. 2.3 కోట్ల ధర ఉన్న ఈ ప్రీమియం ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్..
Toyota Land Cruiser 300 bookings : టయోటా ల్యాండ్ క్రూజర్ 300కి సంబంధించిన కీలక అప్డేట్. ఈ మోడల్ బుకింగ్స్‌ని ఇండియాలో సంస్థ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రీమియం ఎస్యూవీ వివరాలను ఇక్కడ చూసేయండి..

టయోటా ల్యాండ్ క్రూజర్ 300 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఎస్యూవీ జెడ్ఎక్స్, జీఆర్-ఎస్ అనే రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధర వరుసగా రూ.2.31 కోట్లు, రూ.2.41 కోట్లుగా నిర్ణయించారు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ల్యాండ్ క్రూజర్ 300 కోసం బుకింగ్‌లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఇది సీబీయూ (కంప్లీట్లీ-బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టయోటా ల్యాండ్ క్రూజర్ 300- ఇంజిన్..
టయోటా ల్యాండ్ క్రూజర్ 300 ఎస్‌యూవీలో వీ6 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,000 ఆర్పీఎమ్ వద్ద 304 బీహెచ్పీ పీక్ పవర్‌ని, 1,600-2,600 ఆర్పీఎమ్ వద్ద 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. గేర్ బాక్స్ అనేది 10-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్. ఇదొక ఆల్-వీల్ డ్రైవ్ ఎస్యూవీ. మల్టీ-టెర్రైన్ సెలెక్ట్ (ఎంటీఎస్), మల్టీ-టెర్రైన్ మానిటర్ కూడా ఉన్నాయి. ఇవి తీవ్రమైన పరిస్థితులను నావిగేట్ చేయడానికి రియల్ టైమ్ సాయాన్ని అందిస్తాయి.
టయోటా ల్యాండ్ క్రూజర్ 300- ఇంటీరియర్..
టయోటా ల్యాండ్ క్రూజర్ 300 క్యాబిన్ అధిక-నాణ్యత కలిగిన లెదర్ అప్హోలిస్ట్రీతో వస్తుంది. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, సొగసైన ట్రిమ్ ఫినిషింగ్‌లతో నిండి ఉంది. ఈ కాక్‌పిట్ డ్రైవర్ ఫోకస్డ్ అని టయోటా తెలిపింది. ఈ ఎస్యూవీ మెమరీ ఫంక్షన్‌తో 8-వే పవర్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లను అందిస్తుంది. జెడ్ఎక్స్ వేరియంట్ రెండు అధునాతన ఇంటీరియర్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. అవి న్యూట్రల్ బీజ్, బ్లాక్. జీఆర్-ఎస్ వేరియంట్ జిఆర్ఎస్ బ్లాక్, బ్లాక్, డార్క్ రెడ్ అప్హోలిస్ట్రీతో వస్తుంది. టయోటా నాలుగు జోన్ల క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, సన్‌రూఫ్‌ను కూడా అందిస్తుంది.
“స్ట్రెంత్, సొఫెస్టికేషన్, ఆఫ్-రోడ్ పవర్‌కి చిహ్నం ఈ ల్యాండ్ క్రూజర్ 300. టయోటా టీఎన్జీఏ-ఎఫ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ మోడల్ శక్తివంతమైన ట్విన్-టర్బో వీ6 ఇంజిన్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు, విలాసవంతమైన, కఠినమైన డిజైన్‌తో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది," అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్- సర్వీస్ - యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా అన్నారు.
“కఠినమైన భూభాగాలకు వెళ్లాలన్నా లేదా నగర రహదారులను నావిగేట్ చేసినా, ఈ ఎస్యూవీ సౌకర్యం, పనితీరు, సాహసం, సాటిలేని సమ్మేళనాన్ని నిర్ధారిస్తుంది. ఇది శ్రేష్టతను కోరుకునేవారికి సరైన సహచరిగా మారుతుంది,” అని చెప్పుకొచ్చారు.
“ల్యాండ్ క్రూజర్ 300 మా కస్టమర్ అంచనాలను మించిపోతుందని మేము విశ్వసిస్తున్నాము. ఇది కలిగి ఉన్న వారసత్వం, ఉత్తమ ఆవిష్కరణ, ఖచ్చితమైన సమతుల్యతను అందిస్తుంది. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో నిజమైన ఐకాన్‌గా మారుతుంది,” అని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం