Toyota Innova Hycross : కొత్త ఇన్నోవా హైక్రాస్​.. నవంబర్​ 25న లాంచ్​!-toyota innova hycross may make its india debut on november 25 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Toyota Innova Hycross May Make Its India Debut On November 25

Toyota Innova Hycross : కొత్త ఇన్నోవా హైక్రాస్​.. నవంబర్​ 25న లాంచ్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 31, 2022 07:03 PM IST

Toyota Innova Hycross launch date : నవంబర్​ 25న.. టయోటా ఇన్నోవా హైక్రాస్​ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన టీజర్​ ఇప్పటికే విడుదలైంది.

కొత్త ఇన్నోవా హైక్రాస్​.. నవంబర్​ 25న లాంచ్​!
కొత్త ఇన్నోవా హైక్రాస్​.. నవంబర్​ 25న లాంచ్​!

Toyota Innova Hycross launch date : ఇన్నోవా హైక్రాస్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు టయోటా సన్నద్ధమైంది. ఆటోకార్​ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ ఎంపీవీ వెహికిల్​.. నవంబర్​ 25న ఇండియాలో లాంచ్​ కానుంది. అయితే.. ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర​కు సంబంధించిన వివరాలు 2023 ఆటో ఎక్స్​పోలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

టీజర్​ ఔట్​..

ఇండియా మార్కెట్​ కన్నా ముందు.. ఈ వాహనాన్ని ఇండోనేషియా మార్కెట్​లో లాంచ్​ చేసేందుకు టయోటా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నోవా హైక్రాస్​ను ఇండోనేషియాలో.. ఇన్నోవా జెనిక్స్​ అనే పేరుతో లాంచ్​ చేస్తోంది టయోటా.

Toyota Innova Hycross latest news : ఇన్నోవా హైక్రాస్​కు సంబంధించిన టీజర్​ను ఇటీవలే విడుదల చేసింది టయోటా ఇండోనేషియా. కారు​ ఫ్రంట్​ డిజైన్​ మాత్రమే ఆ టీజర్​లో రిలీజ్​ చేశారు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇన్నోవా క్రిస్టాకు ఇది భిన్నంగా కనిపిస్తుడటం విశేషం. టయోటా కొరొల్లా క్రాస్​ కారును.. ఈ ఇన్నోవా హైక్రాస్​ ఫ్రంట్​ డిజైన్​ పోలి ఉంది. అప్​ రైట్​ హెక్సాగొనల్​ గ్రిల్​ ఇందులో ఉంది. దీనితో ఇన్నోవా హైక్రాస్​ అపియరెన్స్​ మరింత డాషింగ్​గా, ఆకర్షణీయంగా మారుతుంది. బానెట్​ను చూస్తే.. కారు ఎంపీవీనే అయినప్పటికీ, ఎస్​యూవీ లుక్ కూడా​ వస్తోంది.

నవంబర్​ నెలలో ఇండియాలో లాంచ్​ అయ్యే వాహనాల వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇన్నోవా హైక్రాస్​కు మోనోకోక్యూ ఛాసీస్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. వాహనం హ్యాండ్లింగ్​, రైడ్ మరింత​ మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో బాడీ రోల్​ కూడా తగ్గుతుంది. ఇది ఫ్రంట్​ వీల్​ డ్రైవ్​ వెహికల్​గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Toyota Innova Hycross features : ఇక ఫీచర్స్​ గురించి మాట్లాడుకోవాలంటే.. టయోటా ఇన్నోవా హైక్రాస్​లో 360డిగ్రీ కెమెరా, సన్​రూఫ్​, రెండో రోలో కుర్చీలకు ఒట్టోమన్​ ఫంక్షనింగ్​ సిస్టెమ్, వైర్​లెస్​ ఛార్జింగ్​​ ఉంటాయని తెలుస్తోంది. ఈ కారు పొడవు 4.7మీటర్లు, వీల్​బేస్​ 2,850ఎంఎం ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్​ను ఇండియా రోడ్ల మీద టెస్ట్​ చేస్తోంది టయోటా. కొత్త వర్షెన్​లో పెట్రోల్​ వేరియంట్​ మాత్రమే ఉంటుందని సమాచారం. కాకపోతే.. కాస్త హైబ్రీడ్​ సిస్టెట్​ టచ్ కూడా ఉండొచ్చు. ఇన్నోవా క్రిస్టా కూడా పెట్రోల్​ వర్షెన్​లోనే అందుబాటులో ఉంది. డీజిల్​ ఇంజిన్​కి సంబంధించి బుకింగ్స్​ను సంస్థ నిలిపేసింది.

అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత.. ఈ వాహనం గురించి మరింత సమాచారంపై స్పష్టత వస్తుంది.

పెరిగిన ధరలు..

Toyota India price hike : టయోటా ఫార్చ్యునర్​, టయోటా ఇన్నోవా క్రిస్టా, కామ్రి హైబ్రీడ్​తో పాటు ఇతర వాహనాల ధరలను ఈ నెలలో పెంచింది సంస్థ. రూ. 19,000- రూ. 1.85లక్షల మధ్యలో ప్రైజ్​ హైక్​ తీసుకుంది. టయోటా ఫార్చ్యూనర్​ 4x2 ఎంటీ, ఏటీ వేరియంట్ల ధరలు రూ. 19,000 పెరిగాయి. ఫలితంగా ఈ టయోటా ఫార్చ్యూనర్​ ధర రూ. 32.59లక్షలు- రూ. 50.34లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్