ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ కారుగా గుర్తింపు తెచ్చుకున్న టయోటా ఇన్నోవా హైక్రాస్‌పై బిగ్ అప్డేట్! తాజాగా జరిగిన బీఎన్సీఏపీ (భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్)లో ఈ ఎంపీవీ 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ఈ ఫలితంతో, హైక్రాస్ భారతదేశంలో ఎన్సీఏపీ ద్వారా రేట్ చేసిన మొట్టమొదటి ఎంపీవీగా నిలిచింది. అంతేకాకుండా, కొత్తగా ప్రవేశపెట్టిడిన భారతీయ భద్రతా మూల్యాంకన కార్యక్రమంలో క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన మొదటి టయోటా మోడల్ కూడా ఇదే.
ఇన్నోవా హైక్రాస్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 30.47 పాయింట్లు సాధించి, గరిష్టంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ టెస్ట్ రేటింగ్‌లు జీఎక్స్8-సీటర్ పెట్రోల్, వీఎక్స్, జెడ్ఎక్స్ హైబ్రిడ్ సహా హైక్రాస్ అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి.
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో, హైక్రాస్ 16 పాయింట్లకు గాను 14.47 పాయింట్లు సాధించింది. ఈ టెస్ట్‌లో చాలా శరీర భాగాలకు 'మంచి' రక్షణ లభించినట్లు రేటింగ్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్- ఫ్రెంట్ ప్యాసింజర్ ఛాతీ భాగం, అలాగే డ్రైవర్ ఎడమ కాలికి 'తగినంత' రక్షణ లభించగా, మిగిలిన శరీర భాగాలుకు కూడా సరైన ప్రొటెక్షన్ లభించింది.
సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో, ఈ ఎంపీవీ అద్భుతమైన పనితీరు కనబరిచి, 16 పాయింట్లకు గాను సంపూర్ణంగా 16 పాయింట్లు సాధించి, అన్ని విభాగాల్లో 'మంచి' రేటింగ్‌లను పొందింది. ఇది సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా 'ఓకే' రేటింగ్‌తో ఉత్తీర్ణత సాధించింది.
హైక్రాస్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఇది 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించి మరో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ ఎంపీవీ డైనమిక్ క్రాష్ టెస్ట్‌లో (24/24), సీఆర్ఎస్ (చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్) ఇన్‌స్టాలేషన్ స్కోర్‌లో (12/12) పూర్తి మార్కులను పొందింది. వాహన అంచనా విభాగంలో ఇది 13 పాయింట్లకు గాను 9 పాయింట్లు సాధించింది.
ఈ టెస్ట్ కోసం 18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలను సూచించే డమ్మీలను ఉపయోగించారు. ఈ డమ్మీలను ISOFIX-అనుకూల టయోటా ఎంఐడీఐ ఐ-సైజ్ సీట్లలో వెనుక వైపుకు అమర్చి సురక్షితంగా ఉంచారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో ప్రామాణికంగా సమగ్ర భద్రతా ఫీచర్లను అందించింది. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.
టాప్-స్పెక్ జెడ్ఎక్స్ (ఓ) వేరియంట్‌లో లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు కూడా ఉన్నాయి.
సంబంధిత కథనం