Toyota Innova EV : బెస్ట్ సెల్లింగ్ టయోటా ఇన్నోవా ఎంపీవీకి ‘ఈవీ’ టచ్.. అదిరిపోయిందంతే!
Toyota Innova EV : టయోటా ఇన్నోవా ఈవీ వర్షెన్‌ని సంస్థ తాజాగా ప్రదర్శించింది. ఇందులో 59.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అంతర్జాతీ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో మరో విప్లవం! భారత్ సహా అనేక దేశాల్లో, వివిధ పేర్లతో బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీగా కొనసాగుతున్న టయోటా ఇన్నోవాకు “ఈవీ” టచ్ ఇచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే జకార్తా వేదికగా జరిగిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ వర్షెన్‌ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టయోటా ఇన్నోవా ఈవీ..
ఆటో షోలో ప్రదర్శించిన ఇన్నోవా ఈవీ.. సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్లలో విక్రయించే కియాంగ్ ఇన్నోవా మోడల్ ఆధారంగా రూపొందించినట్టు స్పష్టమవుతోంది. జాపనీస్ ఆటో దిగ్గజం ప్రకారం.. ఈ ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ త్వరలో ప్రాడక్షన్ స్టేజ్‌కి వెళుతుంది. ఆ తర్వాత సేల్స్ ప్రారంభమవుతాయి.
ఆసియా మార్కెట్లలో టయోటా మోటార్ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఇన్నోవా ఒకటి. మరీ ముఖ్యంగా భారతదేశంలో, టయోటా ఎంపీవీకి చెందిన రెండు వర్షెన్లకు సూపర్ డిమాండ్ ఉంది. ఇన్నోవా హైక్రాస్ అనేది ఇన్నోవా క్రిస్టా ఐసీఈ ఇంజిన్‌కి బలమైన హైబ్రిడ్ వర్షెన్.
ఈ టయోటో ఇన్నోవా ఎలక్ట్రిక్ కారుపై సంస్థ భారీ ఆశలే పెట్టుకుంది. ఐసీఈ ఇంజిన్‌తో పాటు ఈ మోడల్ కూడా బంపర్ హిట్ కొట్టి, సంస్థ సేల్స్‌ని పెంచుతుందని ఆశిస్తోంది.
టయోటా ఇన్నోవా ఈవీ- బ్యాటరీ వివరాలు..
టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ ఎంపీవీ కాన్సెప్ట్ వర్షెన్ 59.3 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఏసీ, డీసీ ఛార్జింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇన్నోవా ఈవీ ఎలాంటి రేంజ్‌ని అందిస్తుందనే దానిపై టయోటా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే కార్ల తయారీ సంస్థ ఈవీ పవర్ ఓట్పుట్ని వెల్లడించింది. ఇది సుమారుగా 180బీహెచ్పీ పవర్, 700ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
టయోటా ఇన్నోవా ఈవీ- డిజైన్, ఫీచర్స్..
టయోటా ఇన్నోవా ఈవీ ప్రస్తుతం అమ్ముడవుతున్న ఇన్నోవా క్రిస్టా ఎంపీవీ అప్డేటెడ్ వర్షెన్‌గా కనిపిస్తుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మోడల్‌తో పోల్చితే ఈవీ వర్షెన్ అనేక డిజైన్ మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత స్పష్టమైన మార్పు.. ఎంపీవీ ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్స్, హెడ్‌లైట్ యూనిట్లతో కూడిన క్లోజ్డ్ గ్రిల్. ఈవీ వర్షెన్ కోసం ముందువైపు రెండు చోట్ల బీఈవీ బ్యాడ్జింగ్ ఉంటుంది. 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ గార్నిష్, బాడీ క్లాడింగ్స్, బ్లాకౌడ్ ఔట్ రూఫ్ వంటివి ఈ ఇన్నోవా ఈవీ ఎంపీలో ఉంటాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్లు, కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఉన్నాయి.
ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ ఇంటీరియర్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న వాటి కంటే భిన్నంగా లేదు. క్యాబిన్లో గుర్తించదగిన మార్పుల్లో ఒకటి బ్యాటరీని ఉంచిన ఫ్లోర్-బెడ్. ఇది వెనుక ప్రయాణికులకు ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్, లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయెల్ టోన్ అప్హోలిస్టరీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఇన్నోవా ఈవీలో ఉన్నాయి.
టయోటా ఇన్నోవా ఈవీపై మరిన్ని వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం