Top 5 cement stocks: కొత్త సంవత్సరంలో బెస్ట్ సిమెంట్ స్టాక్స్ ఇవే..
Top 5 cement stocks: కొత్త సంవత్సరం రాబోతోంది. అందరికీ ఇతర ప్రణాళికలతో పాటు, పెట్టుబడులపై కూడా కొత్త సంవత్సరంలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఒక ఫేమస్ బ్రోకరేజ్ ఫర్మ్ ఈ సిమెంట్ స్టాక్స్ లో పెట్టుబడుల విషయంపై కొన్ని సూచనలు చేస్తోంది.
Top 5 cement stocks: ప్రముఖ బ్రోకరేజ్ ఫర్మ్ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Emkay Global Financial Services Limited) సిమెంట్ స్టాక్స్ పై సానుకూల సూచనలను ఇస్తోంది. ముఖ్యంగా ఈ ఐదు సిమెంట్ స్టాక్స్ సమీప భవిష్యత్తులోనే మంచి రిటర్న్స్ ఇస్తాయని సూచిస్తోంది.
Top 5 cement stocks: నిర్మాణ రంగానికి ఊపు..
2023లో నిర్మాణ రంగం మరింత ఊపందుకునే అవకాశముందని, కోవిడ్ 19 ప్రతికూలతల నుంచి తేరుకుని, మంచి అభివృద్ధిని కనబరిచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లో ఇన్ ఫ్రా స్టాక్స్ తో పాటు, సిమెంట్ స్టాక్స్ కు కూడా సానుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Emkay Global Financial Services Limited) కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది.
Top 5 cement stocks: ఇవి కొనొచ్చు..
అందువల్ల, 2023లో సిమెంట్ సెక్టార్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ అయిన అల్ట్రా టెక్(UltraTech), శ్రీ సిమెంట్(Shree Cement)లతో పాటు ఏసీసీ(ACC), బిర్లా కార్పొరేషన్(Birla Corp), సాగర్ సిమెంట్(Sagar Cements) స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమవుతుందని సూచిస్తోంది. వీటికి బై(buy)’ రేటింగ్ ను ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా త్రైమాసికాల్లో డిమాండ్ పెరగనుండడంతో, సిమెంట్ ధరలు పెరిగే అవకాశముందని ఎమ్కేలో రిసెర్చ్ అనలిస్ట్ ధర్మేశ్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో బ్యాగ్ కు రూ. 10 నుంచి రూ. 12 వరకు పెంచడానికి సిమెంట్ కంపెనీలు ప్రయత్నిస్తాయన్నారు.
Top cement stocks to buy
Company Name | Rating | Target Price in Rs. |
UltraTech | Buy | 7,100 |
Shree | Buy | 23,300 |
Ambuja | Hold | 480 |
Dalmia | Hold | 1,600 |
ACC | Buy | 2,625 |
Ramco | Hold | 670 |
JK Cement | Hold | 2,800 |
Birla Corp | Buy | 1,185 |
Sagar Cements | Buy | 220 |
Star Cement | Hold | 105 |
Source: Emkay Research |
సూచన: ఇది నిపుణుల సూచనలతో కూడిన కథనం మాత్రమే. ఇన్వెస్టర్లు సొంత విశ్లేషణతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.