Luxury Electric Cars : 500 కి.మీ రేంజ్‌తో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు.. అబ్బో అద్భుతమైన ఫీచర్లు!
Luxury Electric Cars : భారత్ మెుబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కోసం ఆటోమెుబైల్ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఈవెంట్‌లో పలు లగ్జరీ కార్లు ప్రదర్శనకు రానున్నాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జనవరి 17 నుండి ప్రారంభమవనుంది. ఈ ఈవెంట్‌లో ఎలక్ట్రిక్ కార్లు ఈసారి ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో ఈ సెగ్మెంట్ దుమ్మురేపుతోంది. ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల గురించి ఓసారి తెలుసుకుందాం..
బీవైడీ సీలియన్
గ్లోబల్ మార్కెట్‌లో బీవైడీ కంపెనీకి మంచి పేరు ఉంది. భారతీయ మార్కెట్లో తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఈసారి ఆటో ఎక్స్‌పోలో సీలియన్ 7ని బీవైడీ ఇండియా ప్రదర్శనకు తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో పలు ఈవీలతో ఇది పోటీ పడనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. 82.5kWh, 91.3kWhతో ఉంటుంది. దీని రేంజ్ సుమారు 502 కి.మీ వరకు ఉండొచ్చని అంచనా.
ఎంజీ సైబర్‌స్టర్
ఎంజీ మోటార్ ఇండియా తన ప్రీమియం ఎలక్ట్రిక్ కారు త్వరలో మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ప్రకటించింది. ఫార్ములా 1 ఇంజనీర్ మార్కో ఫెనెల్లో రూపొందించిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ 510పీఎస్, 725ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఈవీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. MG నుండి ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సీబీయూ ద్వారా భారత మార్కెట్లోకి తీసుకువస్తారు. కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కంపెనీ తన ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ఎంజీ సెలెక్ట్ ద్వారా దీన్ని విక్రయిస్తుంది.
ఎంజీ ఎం9
ఎంజీ ఎం9 భారత మార్కెట్‌లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఎంజీ Mifa 9గా విక్రయిస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏస్, 360-డిగ్రీ కెమెరాను. ఈ ఎలక్ట్రిక్ కారు 90 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. e-MPV 245హెచ్‌పీ శక్తిని, 350ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటారును పొందుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 440 కి.మీల రేంజ్ ఇస్తుంది.