ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్ట్ అవుతున్నాయి. అయితే లాంగ్ టర్మ్‌లో మాత్రం మన మార్కెట్లు మంచి రిటర్నులే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా లో-రిస్క్ కలిగిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గత 5ఏళ్ల వ్యవధిలో మెరుగైన ప్రదర్శన చేశాయనే చెప్పుకోవాలి. కొన్ని లార్జ్ క్యాంప్ ఫండ్స్ ఏకంగా 18శాతం కన్నా అధికంగా రిటర్నులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో బెంచ్మార్కెట్ సూచీలతో పోలిస్తే, మంచి రిటర్నులు ఇచ్చిన టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
2) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్: 18.30% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
3) హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్: 17.2% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
4) జేఎం లార్జ్ క్యాప్ ఫండ్- 16.65% వర్సెస్ 15.82% (బీఎస్ఈ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
5) కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్: 16.52% వర్సెస్ 15.82% (బీఎస్ఈ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
6) కోటక్ బ్లూచిప్ ఫండ్: 16.38% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
7) ఎడిల్వైజ్ లార్జ్ క్యాప్ ఫండ్- 16.37% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
8) మహీంద్రా మనులైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్- 16.37% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)
9) బరోడా బీఎన్పీ పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్- 16.22% వర్సె్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ఇండెక్స్)
10) ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్:-15.97% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్
లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక రకమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇది ప్రధానంగా లార్జ్-క్యాప్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ఇవి సాధారణంగా చిన్న కంపెనీల కంటే తక్కువ అస్థిరంగా ఉంటాయి. ఫలితంగా ఈ ఫండ్లు మరింత స్థిరమైన పెట్టుబడి ఎంపికగా మారుతాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకారం.. భారతదేశంలో, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా లార్జ్ క్యాప్ కంపెనీలు టాప్ 100 కంపెనీల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు తరచుగా మార్కెట్ లీడింగ్ కంపెనీలు, వాటి స్థిరత్వం, బలమైన మార్కెట్ ఉనికికి ప్రసిద్ది చెందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి కంపెనీలు ఇందుకు ఉదాహరణలు.
అయితే, మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునే ముందు వాటి గత ప్రదర్శనను చూడవచ్చు కానీ అదొక్కటే ప్రామాణికం కాదని గుర్తించాలి.
సంబంధిత కథనం