Highway driving tips : హైవే మీద డ్రైవ్​ చేస్తున్నారా? ఈ టిప్స్​తో సేఫ్​గా ఉండండి..-top five rules and tips to follow while driving on highways ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Top Five Rules And Tips To Follow While Driving On Highways

Highway driving tips : హైవే మీద డ్రైవ్​ చేస్తున్నారా? ఈ టిప్స్​తో సేఫ్​గా ఉండండి..

Sharath Chitturi HT Telugu
Nov 14, 2023 01:10 PM IST

Highway driving tips : హైవేపై డ్రైవింగ్​లో ఎలాంటి రూల్స్​ పాటించాలో మీకు తెలుసా? సేఫ్​ డ్రైవింగ్​ కోసం కొన్ని టిప్స్​ తెలుసుకోవాలి. ఆ వివరాలు..

హైవే మీద డ్రైవ్​ చేస్తున్నారా? ఈ టిప్స్​తో సేఫ్​గా ఉండండి..
హైవే మీద డ్రైవ్​ చేస్తున్నారా? ఈ టిప్స్​తో సేఫ్​గా ఉండండి..

Highway driving tips in Telugu : కొత్తగా డ్రైవింగ్​ నేర్చుకున్నారా? లేక కొత్తగా కారు కొన్నారా? హైవేలపై డ్రైవింగ్​తో మంచి థ్రిల్​ వస్తుందని.. ఏదైనా ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రహదారులపై డ్రైవింగ్​ చేసేడప్పుడు పాటించాల్సిన కొన్ని రూల్స్​, మీ డ్రైవింగ్​కు ఉపయోగపడే కొన్ని టిప్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

స్పీడ్​ ఓరియెంటెడ్​ లేన్స్​ని ఫాలో అవ్వండి..

స్పీడ్​ ఓరియెంటెడ్​ లేన్​ రూల్​ చాలా సాధారణమైన విషయం. మెల్లిగా వెళుతున్న వాహనాలు.. లేన్​కు ఎడమవైపు ఉండాలి. ఫాస్ట్​గా వెళుతున్న వాహనాలు కుడివైపు ఉండాలి. ఈ రూల్​ పాటిస్తే.. రాంగ్​సైడ్​ నుంచి ఓవర్​టేక్​ చేయాల్సిన పరిస్థితి తప్పుతుంది.

డైరెక్షన్​ ఓరియెంటెడ్​ లేన్స్​ రూల్​ పాటించండి..

రాహదారులపై 3,4 లేన్​లు ఉంటాయి. అయితే.. మీరు వెళ్లే డైరెక్షన్​ బట్టి, ఏ లేన్​పై ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి. లెఫ్ట్​ టర్న్​ తీసుకోవాలనుకోండి.. ఎడమవైపు ఉండాలి. అదే రైట్​ టర్న్​ తీసుకోవాలనుకోండి.. కుడివైపు ఉండాలి. స్ట్రైట్​ వెళ్లాలంటే.. మిడిల్​ లేన్​లో ఉండాలి.

ఓవర్​స్పీడింగ్​ వద్దు.. సేఫ్​ డ్రైవింగ్​ ముద్దు!

Highway driving tips : ఓవర్​స్పీడింగ్​ అస్సలు చేయకూడదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము. 'స్పీడ్​ థ్రిల్స్​.. బట్​ కిల్స్​' అన్నది గుర్తుపెట్టుకోండి. రహదారులపై స్పీడ్​ లిమిట్​తో కూడిన సైన్​ బోర్డ్స్​ ఉంటాయి. వాటిని చూస్తూ, అదే స్పీడ్​ని ఫాలో అవ్వండి. సపీడ్​ లిమిట్​ని అస్సలు దాటకండి.

ఇండికేటర్స్​ని కచ్చితంగా వాడాలి..

రహదారులపై ఉన్నప్పటికీ.. కచ్చితంగా ఇండికేటర్స్​ని వాడాలి. ఏ టర్న్​ తీసుకుంటే.. ఆ టర్న్​కి ఇండికేటర్​ వేయాలి. కొంతదూరంలోనే ఇండికేటర్​ని ఆన్​ చేయాలి. లేన్​ మారుతున్నప్పుడు కూడా ఇండికేటర్​ని ఉపయోగిస్తే బెస్ట్​. ఇండికేటర్​లు వేయకుండా లేన్​ని చేంజ్​ చేయడం లేదా టర్నింగ్​ తీసుకోవడం రహదారులపై అత్యంత ప్రమాదకరం.

జంక్షన్స్​ దగ్గర స్లో అవ్వాలి..

How to drive safe on highways : హైవేలపై క్రాసింగ్స్​, ఇంటర్​సెక్షన్స్​ ఉంటాయి. మధ్య మధ్యలో గ్రామాలు, పట్టణాలు కూడా తగులుతూ ఉంటాయి. ఆయా చోట్ల వెహికిల్​ని స్లోగా డ్రైవ్​ చేయాలి. స్లోగా డ్రైవ్​ చేస్తే.. రియాక్షన్​ టైమ్​ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అడ్డొస్తే.. మీరు బ్రేక్​ వేయడానికి టైమ్​ ఎక్కువగా ఉంటుంది.

రహదారులపై చాలా మంది రాష్​, ఫాస్ట్​ డ్రైవింగ్​ చేస్తారు. ఇది మంచిది కాదు! ఇండియాలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఫాస్ట్​ డ్రైవింగ్​. సరైన రూల్స్​ పాటిస్తూ డ్రైవింగ్​ చేస్తే.. మీతో పాటు మీతోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడుకోగలుగుతారు.

WhatsApp channel

సంబంధిత కథనం