రూ.1000లోపు ఐదు స్టైలిష్ ఇయర్ బడ్స్.. బ్యాటరీ లైఫ్ కూడా సూపర్!-top five earbuds deals under 999 rupees and battery life also good know where to purchase ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.1000లోపు ఐదు స్టైలిష్ ఇయర్ బడ్స్.. బ్యాటరీ లైఫ్ కూడా సూపర్!

రూ.1000లోపు ఐదు స్టైలిష్ ఇయర్ బడ్స్.. బ్యాటరీ లైఫ్ కూడా సూపర్!

Anand Sai HT Telugu

మీరు ఇయర్ బడ్స్ కొనాలని లేదా ఎవరికైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తుస్తున్నారా? మీ కోసం అదిరిపోయే ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్‌లో వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు లభించే కొన్ని బ్రాండెడ్ ఇయర్ బడ్స్ చూద్దాం..

ఇయర్ బడ్స్

కొత్తగా ఇయర్ బడ్స్ కొనాలని చూస్తుంటే మార్కెట్‌లో అనేక కంపెనీలవి దొరుకుతున్నాయి. అయితే తక్కువ ధరలోనే మంచివి తీసుకోవాలనుకుంటే.. అమెజాన్ మీకు అనేక ఆప్షన్స్ అందిస్తుంది. వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు లభించే కొన్ని బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ జాబితాలోని ఒక మోడల్ 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీకు నచ్చిన ఇయర్ బడ్స్ వెంటనే ఆర్డర్ చేయండి..

బోల్ట్ ఆడియో జెడ్40 గేమింగ్

అమెజాన్‌లో రూ.999 ధరకు లభిస్తోంది. ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇది మొత్తం 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 40 ఎంఎస్ అల్ట్రాలో లేటెన్సీతో వస్తుంది. ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. ఇది స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీని కలిగి ఉంది.

బోల్ట్ ఆడియో మావరిక్

అమెజాన్లో రూ.799 ధరకు లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. దీని కేస్ కూడా స్లీక్‌గా ఉంటుంది. ఇది మొత్తం 35 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 45 ఎంఎస్ తక్కువ లేటెన్సీతో వస్తుంది. ఈ కేసులో ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. ఇది స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీని కలిగి ఉంది.

ట్రూక్ కొత్త లాంచ్ క్రిస్టల్ డైనో

అమెజాన్లో రూ.999 ధరకు లభిస్తోంది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఇది 70 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 40 ఎంఎస్ తక్కువ లేటెన్సీతో వస్తుంది. బడ్స్‌లో గ్రీన్ ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. ఇది స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీని కలిగి ఉంది.

మివి కమాండో ఎక్స్7

అమెజాన్లో రూ.999 ధరకు లభిస్తోంది. ఇవి గేమింగ్ ఇయర్ బడ్స్, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 35 ఎంఎస్ తక్కువ లేటెన్సీతో వస్తుంది. దీని కేస్, బడ్స్ రెండింటికీ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. దీనికి స్పష్టమైన సౌండ్ కోసం ఏఐ ఈఎన్సీ మద్దతు ఉంది.

నెంబర్ నావో బడ్స్ ఎన్1

అమెజాన్లో రూ.999 ధరకు లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ లుక్‌లో కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇందులో డ్యూయల్ కలర్ కాంబినేషన్స్ కనిపిస్తాయి. 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 35 ఎంఎస్ తక్కువ లేటెన్సీతో వస్తుంది. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీ సపోర్ట్ వస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.