CNG Cars : ఈ సీఎన్‌జీ కార్లు మంచి మైలేజీ ఇస్తాయి.. ఓసారి లుక్కేయండి-top cng suvs with good mileage on indian roads toyota hyryder and maruti fronx maruti brezza know more details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cng Cars : ఈ సీఎన్‌జీ కార్లు మంచి మైలేజీ ఇస్తాయి.. ఓసారి లుక్కేయండి

CNG Cars : ఈ సీఎన్‌జీ కార్లు మంచి మైలేజీ ఇస్తాయి.. ఓసారి లుక్కేయండి

Anand Sai HT Telugu
Jul 02, 2024 10:26 AM IST

CNG SUVs : ఇటీవలి కాలంలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఈ కార్లవైపు మెుగ్గు చూపుతున్నారు. ఈ కార్ల మైలేజీ కూడా బాగుంటుంది. వాటిలో కొన్ని సీఎన్‌జీ SUVలు గురించి చూద్దాం..

సీఎన్జీ కార్లు
సీఎన్జీ కార్లు

ఇండియాలో చాలా మంది కార్ల కొనుగోలుదారుల మొదటి ఆప్షన్ కార్ల మైలేజీ కోసమే. కారు మైలేజీని పెంచేందుకు కార్ల తయారీ కంపెనీలు ఎన్నో కసరత్తులు చేస్తాయి. అందుకోసం సీఎన్‌జీ కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. సులభమైన, అత్యంత ప్రజాదరణ పొందిన ఇంధన రకం CNG. పెట్రోల్ కంటే చౌకైన CNG ఎంపికను ఇటీవలి కార్ల తయారీ కంపెనీలు తమ కొన్ని కార్ మోడళ్లలో అమలు చేస్తున్నాయి. ఏ CNG కార్లు అత్యధిక మైలేజీని ఇస్తాయో తెలుసుకుందాం..

మారుతి సుజుకి బ్రెజ్జా

మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీలో ఉంది. ఈ మోడల్ బ్రెజ్జాకి వస్తున్నది. దీని ధర రూ. 8.29 లక్షల నుండి రూ. 14.14 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 103 PS గరిష్ట శక్తిని, 137 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

CNG పవర్డ్ కారులో కూడా అదే ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. అయితే ఇది 88 PS పవర్, 121.5 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లు 17.38 kmpl - 19.8 kmpl, CNG వేరియంట్లు 25.51 km/kg మైలేజీని అందిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి తన మారుతి ఫ్రాంక్స్ SUVని S-CNG వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ S-CNG (మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG) SUV ధర రూ.8.41 లక్షలు. ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV సిగ్మా, డెల్టా వేరియంట్లలో అందుబాటులో ఉంది. సుజుకి ఫ్రాంక్ ఎస్‌యూవీలో సిగ్మా వేరియంట్ ధర రూ.8.41 లక్షలు కాగా, డెల్టా వేరియంట్ ధర రూ.9.27 లక్షలు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ S-CNG SUV 28.51 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ S-CNG మోడల్ భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ Xter CNG మోడల్‌తో పోటీపడుతుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్.. మైలేజీతో పాటు ఈ SUV ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. వీటిని అధిక సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. దేశీయ విపణిలో కొనుగోలుకు అందుబాటులో ఉన్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.14 లక్షల నుండి రూ.20.19 లక్షలు. గత సంవత్సరం మారుతి భాగస్వామ్యంతో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను మారుతి గ్రాండ్ విటారా రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా పరిచయం చేసింది. హైబ్రిడ్ టెక్నాలజీతో లీటరుకు 27.97 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

WhatsApp channel