WhatsApp features : ఇప్పుడు చాటింగ్​తో మరింత ఫన్​! ఏఐ స్టూడియోతో పాటు వాట్సాప్​లో మరిన్ని ఫీచర్స్​..-top 6 whatsapp features from ai studio built in dial pad custom photo stickers and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Features : ఇప్పుడు చాటింగ్​తో మరింత ఫన్​! ఏఐ స్టూడియోతో పాటు వాట్సాప్​లో మరిన్ని ఫీచర్స్​..

WhatsApp features : ఇప్పుడు చాటింగ్​తో మరింత ఫన్​! ఏఐ స్టూడియోతో పాటు వాట్సాప్​లో మరిన్ని ఫీచర్స్​..

Sharath Chitturi HT Telugu
Feb 04, 2025 09:00 AM IST

2025 జనవరిలో వాట్సాప్​ ఏకంగా 6 కొత్త ఫీచర్స్​ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ మరింత మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ టాప్​ 6 వాట్సాప్​ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్​ కొత్త ఫీచర్స్​..
వాట్సాప్​ కొత్త ఫీచర్స్​.. (WhatsApp)

వినియోగదారుల ఎక్స్​పీరియెన్స్​ని మెరుగుపరిచేందుకు వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 2025 జనవరిలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో వాట్సాప్​ వినియోగదారుల కోసం ఏకంగా 6 కొత్త ఫీచర్స్​ని ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్లలో కొన్ని గతంలో బీటాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. తాజా ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడానికి, మీరు మీ వాట్సాప్​ని లేటెస్ట్​ వెర్షన్​కి అప్​డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్​ కొత్త ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్​ కీలక అప్​డేట్స్​..

1. చాట్ కోసం ఏఐ స్టూడియో..

వాట్సాప్​ ఏఐ స్టూడియో ఫీచర్​ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారులను వివిధ ఏఐ పర్సనాలిటీలతో నిమగ్నం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఇంటరాక్షన్​కి ఫన్​ని యాడ్​ చేస్తాయి. ఫేమస్​ పర్సనాలిటీస్​ నుంచి వివిధ వ్యక్తుల రోల్స్​ని ఈ పర్సనాలిటీస్​ కలిగి ఉంటాయి. మెటా ఏఐ చాట్ విండో ద్వారా మీరు ఈ ఫీచర్​ని యాక్సెస్ చేసుకోవచ్చు.

2. ఐఓఎస్ యూజర్ల కోసం బిల్ట్ ఇన్ డయల్ ప్యాడ్

ఐఫోన్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్​లో బిల్ట్ ఇన్ డయల్ ప్యాడ్​ను పొందుతున్నారు. కాల్స్ ట్యాబ్​లోని ప్లస్ (+) ఐకాన్​ను ట్యాప్ చేయడం ద్వారా, వినియోగదారులు మొదట కాంటాక్ట్​లకు సేవ్ చేయకుండా నేరుగా ఫోన్ నంబర్లను డయల్ చేయవచ్చు.

3. డబుల్ ట్యాప్ టు రియాక్షన్..

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు మెసేజ్​లను డబుల్ ట్యాప్ చేసి ఎమోజీలతో వేగంగా రియాక్ట్ అవ్వొచ్చు. ఇది ఇన్​స్టాగ్రామ్ డీమ్​లో కనిపించే ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది. వినియోగదారులు ఎమోజీ రెస్పాన్స్​ మెనూను తెరవడానికి సందేశాన్ని ట్యాప్ చేయవచ్చు. ఇష్టమైన ఎమోజీని ఎంచుకోవచ్చు.

4. కస్టమ్ ఫోటో స్టిక్కర్స్, స్టిక్కర్ ప్యాక్ షేరింగ్..

వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు తమ గ్యాలరీలోని ఫోటోల నుంచి కస్టమ్ స్టిక్కర్లను సృష్టించడానికి అనుమతిస్తుంది. యాప్ ఆటోమేటిక్​గా మీ ఇమేజ్ నుంచి సబ్జెక్ట్​ను కట్ చేసి, స్టిక్కర్​గా మారుస్తుంది. స్టిక్కర్ స్పేస్ నుంచి నేరుగా లింక్ పంపడం ద్వారా మీరు స్టిక్కర్ ప్యాక్​లను ఇతరులతో పంచుకోవచ్చు.

5. ఫోటోలకు బ్యాక్​గ్రౌండ్ ఎఫెక్ట్స్..

ఇప్పటి వరకు కేవలం వీడియో, స్టేటస్ అప్​డేట్స్ కోసమే అందుబాటులో ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్​ని వ్యక్తిగత చాట్​లకు ఎక్స్​టెండ్​ చేసింది వాట్సాప్​. ఫొటోలను పంపించేముందు వాటికి వివిధ ఎఫెక్ట్స్​, ఫిల్టర్స్​ని ఎంచుకోవచ్చు.

6. ఫార్వర్డ్ చేయడానికి ముందు మెసేజ్​ యాడ్​..

ఆండ్రాయిడ్ వినియోగదారులకు టెక్స్ట్, మీడియా లేదా లింక్​లను ఫార్వర్డ్ చేసేటప్పుడు పర్సనలైజ్​డ్​ సందేశాలను జోడించడం సులభతరం చేసింది వాట్సాప్. ఈ ఆప్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం