Personal loan interest rates : పర్సనల్ లోన్ కావాలా? టాప్ 6 బ్యాంక్స్‌లో వడ్డీ రేట్లు ఇలా..
Personal loan tips in Telugu : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? మరి ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో చెక్ చేశారా? దేశంలోని టాప్ 6 బ్యాంక్‌లలో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డబ్బు అవసరాల కోసం చాలా మంది ఇప్పుడు పర్సనల్ లోన్వైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంక్‌లు కూడా వీటిని పొందడం సులభతం చేసేశాయి. అయితే, పర్సనల్ లోన్‌కి అప్లై చేసే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటిల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు చాలా కీలకం. తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందితే, మన మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ 6 బ్యాంక్‌లలో పర్సనల్ లోన్‌పై వసులూ చేస్తున్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాప్ 6 బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ఈ రేట్లను వసూలు చేస్తాయి..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. పర్సనల్ లోన్‌పై 10.85 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.6,500.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ ఏడాదికి 10.85 శాతం నుంచి 16.65 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 2 శాతం వరకు ఉంటాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ రుణదాత సంవత్సరానికి 10.99 శాతం నుంచి 16.99 శాతం వరకు పర్సనల్ లోన్‌పై వడ్డీని వసూలు చేస్తుంది. అయితే ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 5 శాతం వరకు ఉంటాయి.
బ్యాంక్ | వడ్డీ రేట్లు (%) |
---|---|
HDFC Bank | 10.85 to 24% |
ICICI Bank | 10.85% to 16.65% ఏడాదికి |
Kotak Mahindra Bank | 10.99% to 16.99% ఏడాదికి |
SBI | 12.60 to 14.60% (కార్పొరేట్ ఉద్యోగులకు) |
Axis Bank | 10.55 to 21.80% |
PNB | 12.50 to 14.50% |
(సోర్స్: బ్యాంక్ వెబ్ సైట్లు)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): భారతదేశంలో అతిపెద్ద రుణదాత కార్పొరేట్ ఉద్యోగుల నుంచి 12.60 శాతం నుంచి 14.60 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు వేర్వేరు రేట్లు ఉన్నాయి.
ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులకు 11.60 శాతం నుంచి 14.10 శాతం వరకు రుణాలు ఇస్తారు.
యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై వడ్డీని 10.55 శాతం నుంచి 21.80 శాతం వరకు వసూలు చేస్తుంది.
పీఎన్బీ : రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు పీఎన్బీ పర్సనల్ లోన్‌పై 12.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.
వ్యక్తిగత రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు సాధారణంగా రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, నెలవారీ జీతం, ప్రస్తుత అప్పులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, ప్రతి బ్యాంకు దాని సొంత క్రెడిట్ పాలసీని కలిగి ఉంటుంది. అందువల్ల, వేర్వేరు వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
ప్రాసెసింగ్ ఛార్జీలు..
వడ్డీ రేట్లతో పాటు, రుణగ్రహీతలు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో మరో ఖర్చు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము రుణ దరఖాస్తును నిర్వహించడానికి రుణదాత వసూలు చేసే ఖర్చును సూచిస్తుంది.
ఈ ఫీజు రుణం ఇచ్చే మొత్తంలో 0.5 శాతం నుంచి 2.5 శాతం మధ్య ఉంటుంది. దీనిని సాధారణంగా రుణ మంజూరు సమయంలో వసూలు చేస్తారు.
(గమనిక:- పర్సనల్ లోన్‌తో రిస్క్ పెరుగుతుందని గ్రహించాలి.)
సంబంధిత కథనం