Top SUV : మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఎస్‌యూవీ ప్లాన్ చేస్తే.. ఈ 5 కార్లపై ఓ లుక్కేయండి
Top SUV Cars : కారు తీసుకునేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. మీరు కూడా ఎస్‌యూవీ కారు ప్లాన్ చేస్తే.. ఈ 5 కార్ల గురించి తెలుసుకోండి.
ఇటీవలి కాలంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఎక్కువమంది కొంటున్నారు. మీరు కూడా అలాంటి కారు ప్లాన్ చేస్తే మీ కోసం మార్కెట్‌లో మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్‌యూవీలు అద్భుతమైన బాడీ స్టైల్, తేలికపాటి ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో పాటు సౌకర్యవంతమైన ఇంటీరియర్ కారణంగా చాలా మంది ఇష్టపడుతారు. కారు కొనేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవడం అవసరం. తక్కువ కాస్ట్‌లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న అందించే 5 ఎస్‌యూవీల గురించి తెలుసుకోండి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను కేవలం రూ. 7.79 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనవచ్చు. దీని టాప్ వేరియంట్ రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 201 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది.
టాటా నెక్సాన్
టాటా మోటార్స్ నుంచి సక్సెస్ అయిన కార్లలో టాటా నెక్సాన్‌ది ప్రత్యేకమైన స్థానం. ఈ ఎస్‌యూవీని కేవలం రూ. 8 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. టాప్ వేరియంట్ కోసం రూ. 15,50 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. ఇది 208 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. టాటా నెక్సాన్ క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.
కియా సోనెట్
కియా సోనెట్ ఎస్‌యూవీ 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది. దీనిని భారతీయ మార్కెట్లో కేవలం రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. సోనెట్ టాప్ వేరియంట్ రూ.15.77 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది.
రెనాల్ట్ కైగర్
రెనాల్ట్ కైగర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో కేవలం రూ. 6 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ రూ. 11.23 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. రెనాల్ట్ కైగర్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 205 మిమీ.
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ ఇటీవల భారత మార్కెట్లోకి కొత్త మాగ్నైట్‌ను లాంచ్ చేసింది. దీన్ని కేవలం రూ. 6 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దాని టాప్ వేరియంట్ రూ. 11.50 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది.