డ్జెట్ ధరలో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. ఈ ఫోన్ల ధర రూ.20 వేల లోపు ఉంటుంది. ఇంకా వీటిలో చౌకైన ఫోన్ ధర రూ.12,499. ఈ లిస్టులో వన్‌ప్లస్‌కు చెందిన పాపులర్ ఫోన్ కూడా ఉంది. బెస్ట్ కెమెరాతోపాటు ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది.
రెడ్ మీ 13 5జీ వేరియంట్ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ ఇండియాలో రూ.12,499గా నిర్ణయించారు. ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ఫోటోగ్రఫీ కోసం రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల డిస్‌ప్లేను అందించింది. ఈ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా స్నాప్ డ్రాగన్ 4 జెన్ 3ఏఈని ఈ ఫోన్‌లో కంపెనీ అందిస్తోంది. ఐపీ53 స్ప్లాష్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
పోకో ఎక్స్6 నియో 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి రూ.13,890కు కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, కంపెనీ ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ టెక్నో పోవా 6 నియో 5జీ వేరియంట్ ధరను అమెజాన్లో రూ.12,999గా నిర్ణయించారు. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 108 మెగాపిక్సెల్ ఏఐ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా డైమెన్సిటీ డీ6300ను కంపెనీ అందిస్తోంది.
హానర్ 200 లైట్ 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.15,900. ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో కంపెనీ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ ఇండియాలో రూ.19,900గా నిర్ణయించారు. ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా స్నాప్ డ్రాగన్ 695 5జీని కంపెనీ అందిస్తోంది. 6.72 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.