Google Chrome extensions: టాప్ 5 గూగుల్ క్రోమ్ ఎక్సటెన్షన్స్ ఇవి..-top 5 google chrome extensions to boost productivity ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Top 5 Google Chrome Extensions To Boost Productivity

Google Chrome extensions: టాప్ 5 గూగుల్ క్రోమ్ ఎక్సటెన్షన్స్ ఇవి..

HT Telugu Desk HT Telugu
Feb 04, 2023 08:45 PM IST

ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, వారి విధులను సులభతరం చేసే అప్డేడ్స్ చేసే గూగుల్ క్రోమ్ లో ఈ ఐదు ఎక్సటెన్షన్స్ చాలా యూజ్ ఫుల్. అవేంటో చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Google Chrome: గూగుల్ క్రోమ్ (Google Chrome) పాపులర్ వెబ్ బ్రౌజర్. ఇందులోని యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఈ వెబ్ బ్రౌజర్ (web browser) ను యూజర్లకు మరింత దగ్గర చేశాయి. ఏఐ టూల్స్, లాంగ్వేజ్ ట్రాన్స్ లేటర్లు వంటి ఎన్నోఫీచర్లను క్రోమ్ (Google Chrome) తీసుకువచ్చింది. క్రోమ్ ఎక్సటెన్షన్లలో (Chrome extensions) ఈ ఐదు చాాలా ఉపయోగకరం. అవి..

ట్రెండింగ్ వార్తలు

Checker Plus చెకర్ ప్లస్

రోజువారీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యాలెండర్ ఎక్స్టెన్షన్. ఈ extension ద్వారా అప్ కమింగ్ ఈవెంట్లను ట్రాక్ చేయొచ్చు. నోటిఫికేషన్లను రిసీవ్ చేసుకోవచ్చు. రిమైండర్లను పెట్టుకోవచ్చు. గూగుల్ క్యాలెండర్ అవసరం లేకుండానే ఇవన్నీ చేయవచ్చు. మిగతా క్యాలెండర్ extensions కన్నా ఇది 100 % పవర్ ఫుల్ అని డెవలపర్లు గట్టిగా చెబుతున్నారు.

LastPass లాస్ట్ పాస్

ఇంటర్నెట్ ప్రపంచంలో పాస్ వర్డే ఎంట్రీ కీ. అయితే, లెక్కకు మించి ఉన్న పాస్ వర్డ్స్ ను గుర్తు పెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అందువల్ల పాస్ వర్డ్ () లను మేనేజ్ చేసే extension ఇది. ఇందులో పాస్ వర్డ్ లను సురక్షితంగా సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ డిటైల్స్ ను కూడా ఇందులోని వాలెట్ ఆప్షన్ లో సేవ్ చేసుకోవచ్చు. వీక్ పాస్ వర్డ్స్, మళ్లీ మళ్లి వాడుతున్ పాస్వర్డ్స్ పై ఇది యూజర్లను హెచ్చరిస్తుంది కూడా. ఈ extension ను మల్టిపుల్ ఫాక్టర్ ఆథెంటికేషన్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

Loom లూమ్

ఈ extension ద్వారా సింగిల్ క్లిక్ తో స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఆర్గనైజేషన్స్ కు, ఎంప్లాయీస్ కు చాలా ఉపయోగకరం. యూజర్లు 720p, 1080p, 1440p, 4K HD ఫార్మాట్లలో వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇది రికార్డెడ్ వీడియోలను ఆటోమేటిక్ గా క్లౌడ్ లో సేవ్ చేస్తుంది.

Toggl Track టాగుల్ ట్రాక్

డెడ్ లైన్లను ట్రాక్ చేసే extension ఇది. దీంట్లో టైమర్ ను ఫిక్స్ చేసుకుని, డెడ్ లైన్లను మేనేజ్ చేయవచ్చు. ఒకే టాస్క్ పై ఎక్కువ సమయం గడపకుండా ఇది అలర్ట్ చేస్తూ ఉంటుంది.

HyperWrite హైపర్ రైట్

మీకు రాసే అలవాటు ఉన్నా, రచయిత కావాలనుకున్నా ఈ extension చాలా యూజ్ ఫుల్. ఈ extension తో 10 రెట్లు ఎక్కువ వేగంతో రాయవచ్చని డెవలపర్లు చెబుతున్నారు. అక్యురేట్ గా వర్డ్, ఫ్రేజ్ సజెషన్స్ ఇస్తుంటుంది.

WhatsApp channel

టాపిక్