మీరు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ల ధర 5 నుంచి 8 వేల రూపాయల మధ్య ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే లిస్టులో శాంసంగ్, మోటరోలా వంటి స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లు బెస్ట్ ఇన్ సెగ్మెంట్ డిస్‌ప్లేలు, కెమెరాలతో వస్తున్నాయి. మీరు ధరను బట్టి గొప్ప ప్రాసెసర్, బ్యాటరీని కూడా పొందుతారు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోటరోలా జీ05 4జీ ధరను అమెజాన్లో రూ.7,109గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.67 అంగుళాల గొప్ప డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్ ప్లే బ్రైట్ నెస్ లెవల్ 1000 నిట్స్ వరకు ఉంటుంది. ప్రాసెసర్‌గా కంపెనీ హీలియో జీ81 ఎక్స్ ట్రీమ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. ఈ ఫోన్‌లో డాల్బీ సౌండ్ కూడా లభిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఎం05 ధరను అమెజాన్లో రూ.6249గా నిర్ణయించారు. ఈ శాంసంగ్ ఫోన్‌లో ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అమెజాన్ ఇండియాలో రూ.6,048 ధరకు లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఫోన్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్ 3 జీబీ వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. దీంతో ఈ ఫోన్ మొత్తం ర్యామ్ 6 జీబీ వరకు ఉంటుంది. ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ ఇండియాలో రూ.7,999గా నిర్ణయించారు. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఓఎస్ విషయానికొస్తే.. ఈ ఫోన్ వన్యూఐ 7 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.
లావా ఓ3 అమెజాన్ ఇండియాలో రూ.5,599గా ఉంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్లో 13 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కంపెనీ అందిస్తోంది. సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్. 10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
టాపిక్