భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ సెప్టెంబర్ 2025లో పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ 2.0 ధరల సర్దుబాట్ల సానుకూల ప్రభావంతో బలమైన అమ్మకాల పనితీరును కనబరిచింది. మరీ ముఖ్యంగా కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు.. సేల్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఒకే ఒక్క సెడాన్.. టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్ల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2025లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్ల పూర్తి వివరాలు, వాటి ముఖ్య ఫీచర్లు, ధరలను ఇక్కడ తెలుసుకోండి..
1. టాటా నెక్సాన్ – 22,573 యూనిట్లు
టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2025లో 22,573 యూనిట్లు అమ్ముడుపోయి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది సంవత్సరానికి 97% అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తున్న ఈ నెక్సాన్, 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో దాదాపు 120 పీఎస్ పవర్‌ని, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో సుమారు 115 పీఎస్ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
కీలక ఫీచర్లు: 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీ.
ధర (ఎక్స్-షోరూమ్): సుమారు రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.05 లక్షల వరకు.
2. మారుతీ సుజుకీ డిజైర్– 20,038 యూనిట్లు
కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. సెప్టెంబర్ 2025లో 20,038 యూనిట్ల అమ్మకాలు జరిపి, గత ఏడాదితో పోలిస్తే 85% వృద్ధిని నమోదు చేసింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు 82 పీఎస్, 112 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కీలక ఫీచర్లు: 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, సీఎన్జీ వేరియంట్ అందుబాటులో ఉంది. విశాలమైన క్యాబిన్, నమ్మదగిన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులతో ఇది కుటుంబాలకు మంచి ఎంపికగా ఉంది.
ధర (ఎక్స్-షోరూమ్): రూ. 6.26 లక్షల నుంచి రూ. 9.31 లక్షల వరకు.
3. హ్యుందాయ్ క్రెటా – 18,861 యూనిట్లు
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా 18,861 యూనిట్ల అమ్మకాలతో తన బలమైన పరుగును కొనసాగించింది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్‌ని, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ 116 పీఎస్ పవర్‌ని అందిస్తాయి. అదనంగా, పవర్‌ని కోరుకునే వారి కోసం 160 పీఎస్ ఉత్పత్తి చేసే టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది.
కీలక ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, లెవల్ 2 అడాస్ వంటి అత్యాధునిక ఫీచర్లు.
ధర (ఎక్స్-షోరూమ్): రూ. 10.73 లక్షల నుంచి రూ. 20.20 లక్షల వరకు.
4. మహీంద్రా స్కార్పియో– 18,372 యూనిట్లు
దృఢమైన డిజైన్, ఆధునిక ఆకర్షణ కలగలిసిన మహీంద్రా స్కార్పియో 18,372 యూనిట్ల అమ్మకాలతో నాల్గొవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది సంవత్సరానికి 27% పెరుగుదలను నమోదు చేసింది. స్కార్పియో శ్రేణిలో క్లాసిక్, స్కార్పియో-ఎన్ వెర్షన్లు రెండూ ఉన్నాయి. ఇవి 2.0 లీటర్ టర్బో-పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో నడుస్తాయి.
కీలక ఫీచర్లు: పవర్ ఫుల్ రోడ్ ప్రెజెన్స్, ఆఫ్-రోడ్ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. పట్టణ- గ్రామీణ కొనుగోలుదారులు ఇద్దరిలోనూ దీనికి మంచి ఆదరణ ఉంది.
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్): స్కార్పియో క్లాసిక్ రూ. 12.98 లక్షలు, స్కార్పియో-ఎన్ ₹13.20 లక్షలు.
5. టాటా పంచ్– 15,891 యూనిట్లు
టాటా పంచ్ 15,891 యూనిట్ల అమ్మకాలతో టాప్ 5 జాబితాను పూర్తి చేసింది. ఇది సెప్టెంబర్ 2024తో పోలిస్తే 16% వృద్ధిని సాధించింది. ఈ మైక్రో-ఎస్‌యూవీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 88 పీఎస్, 115 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో ఇది లభిస్తుంది.
కీలక ఫీచర్లు: అదనపు సామర్థ్యం కోసం సీఎన్జీ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది కాంపాక్ట్‌గా, ఫీచర్-రిచ్‌గా ఉంది.
ధర (ఎక్స్-షోరూమ్): రూ. 5.50 లక్షల నుంచి రూ 9.30 లక్షల వరకు. టాటా త్వరలో దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేయనుంది!
సంబంధిత కథనం